KTR : ‘ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ రివ్యూ.. గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అంటూ..
సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. (KTR)
- Saketh U
- Updated on- September 27, 2026 / 09:42 AM IST
KTR
KTR : నాని ప్యారడైజ్ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజై యావరేజ్ టాక్ తో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర ఉండటం, దాన్ని ప్రియదర్శి పోషించడంతో ఒక్కసారిగా సినిమాకు హైప్ వచ్చింది. కేసీఆర్ అభిమానులు, బిఆర్ఎస్ కార్యకర్తలు ప్యారడైజ్ సినిమాని చూడటానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ సినిమా చూశారు.
సినిమా చూసిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే తీరును ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి, ఆ సమాజాన్ని ఎలా ముందుండి నడిపించాడో చక్కటి కథాంశంతో ఆవిష్కరించారు. ఈ అస్తిత్వ పోరాటానికి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారికి, హీరో సోదరుడు నాని గారికి, అలాగే చిత్ర నిర్మాణ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
తెలంగాణ నేల నేపథ్యంలో, సహజసిద్ధమైన తెలంగాణ యాస, భాషలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఒక గొప్ప కావ్యంలా సాగింది. అణచివేతకు గురైనప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూపిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా నేపథ్యం, ఇందులో చూపించిన పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది అని అన్నారు.
Also Read : NTR : గాయం నుంచి ఇంకా కోలుకొని ఎన్టీఆర్..? కానీ మలయాళ హీరో కోసం రంగంలోకి..?
అలాగే ఈ సినిమా గురించి ట్విట్టర్లో స్పందిస్తూ.. అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేతపై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకి హృదయపూర్వక అభినందనలు. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు అని రాసి “చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!” అనే డైలాగ్ ని ప్రస్దావిని అదే ఎవరో మీకు తెలుసు అంటూ ట్వీట్ చేసారు. దీంతో ప్యారడైజ్ సినిమాపై నాని రివ్యూ వైరల్ గా మారింది.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…
— KTR (@KTRBRS) September 26, 2026
