Monalisa Missing: కుంభమేళా మోనాలిసా మిస్సింగ్.. అదృశ్యంపై భర్త సంచలన వీడియో
కుంభమేళా ఫేమ్ మోనాలిసా మిస్సింగ్(Monalisa Missing) అంటూ షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన భర్త ఫర్మాన ఖాన్.
- V Santhosh Kumar
- Published On : April 12, 2026 / 04:55 PM IST
Kumbh Mela Mona Lisa Missing: Husband released Shocking Video
- అజ్మేర్ పర్యటనలో అదృశ్యమైన మోనాలిసా
- మైనర్ అని తేలిన వేళ మోనాలిసా అదృశ్యం
- విచారణ చేప్పట్టిన పోలీసులు
Monalisa Missing: కుంభమేళా బ్యూటీగా పేరు తెచ్చుకున్న మోనాలిసా అదృశ్యం కావడం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా ఆమె ఆచూకీ లభించడం లేదని ఆమె భర్తగా చెప్పుకుంటున్న ఫర్మాన్ ఖాన్ ఒక సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించారు. రాజస్థాన్‌లోని అజ్మేర్ పర్యటనకు వెళ్లినప్పటి నుండి ఆమె కనిపించడం లేదని, అసలు ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేక న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ఈ అదృశ్యం వార్త పలు అనుమానాలకు తావిస్తోంది.
Vishnu Priya: వివాదంలో విష్ణు ప్రియ.. డబ్బుకోసం అసభ్యకర కంటెంట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఐఎస్‌ఎఫ్
ముఖ్యంగా మోనాలిసా వయసుపై ఉన్న వివాదం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది. ఆమె మేజర్ కాదని, మైనర్ అని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) ఇప్పటికే నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఫర్మాన్ ఖాన్‌పై ఇప్పటికే పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఒకవైపు పోలీసుల విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే ఆమె మాయమవ్వడం(Monalisa Missing) వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త విడుదల చేసిన వీడియో ఈ కేసులో ఒక అనూహ్య మలుపుగా మారింది.
ప్రస్తుతం పోలీసులు ఈ అదృశ్యంపై లోతైన విచారణ జరుపుతున్నారు. మోనాలిసా స్వచ్ఛందంగా ఎక్కడికైనా వెళ్లిందా లేక ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మైనర్ అని తేలిన తర్వాత కూడా ఆమె భర్తతోనే ఉండటం, ఇప్పుడు ఆమె కనిపించకుండా పోవడం వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీసేందుకు రాజస్థాన్, స్థానిక పోలీసులు పనిచేస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విచారణ తర్వాతే ఈ అదృశ్యం వెనుక ఉన్న అసలు మిస్టరీ వీడే అవకాశం ఉంది.
