Kurma Nayaki : మనుషుల నుంచి దేవుడిని దెయ్యాలు రక్షించే కథ విన్నారా..?

మనుషులకి దొంగలు నుంచి, దెయ్యాల నుంచి సమస్య ఎదురైతే దేవుడిని ప్రార్థిస్తారు. అలాంటిది దేవుడికి మనిషితోనే సమస్య వస్తే..

Kurma Nayaki story tells devils protect goddess from humans

Kurma Nayaki : మనుషులకి దొంగలు నుంచి సమస్య ఎదురైనా, దెయ్యాల నుంచి భయం కలిగినా.. ధైర్యం కోసం దేవుడిని ప్రార్ధిస్తారు. తమ సమస్యని విన్న దేవుడు తమ కోసం వస్తాడని, తమని రక్షిస్తారని నమ్ముతారు. అందుకనే ఏ సమస్య వచ్చినా ముందుగా దేవుడినే తలచుకుంటారు. అలాంటిది దేవుడికే సమస్య వస్తే.. అది కూడా మనుషులు వల్లే సమస్య ఎదురైతే.. ఎవరు వచ్చి కాపాడతారు..? మన పురాణాల్లో దేవతలకు సైతం సమస్యలు వచ్చినప్పుడు.. పరిష్కారం కోసం త్రిమూర్తులను ప్రార్థిస్తారు.

ఇక ఆ త్రిమూర్తులు దేవతల సమస్యకు పరిష్కారం చెప్పడం, లేదా వారే రంగంలోకి దిగి ఆ సమస్యని తొలిగించడమో చేస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి కథలు చాలానే విని ఉంటారు. కానీ ఇప్పుడు ఒక సరికొత్త కొత్త వినిపించబోతున్నారు, కాదు కాదు చూపించబోతున్నారు. ఈ కథలో దేవుడికి మనుషులు నుంచే సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి దేవుళ్ళని కాపాడడానికి దెయ్యాలు, దొంగలు వస్తారట. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. కానీ ఇప్పుడు ఇదే కథని సినిమాగా తీసుకు రాబోతున్నారు.

Also read : Salaar : సలార్ నుంచి క్రేజ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. కానీ బ్యాడ్ న్యూస్..

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో ఒక హార్రర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కబోతుంది. ‘కుర్మా నాయకి’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొత్త దర్శకుడు హర్ష వర్ధన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇతను దర్శకుడు సుకుమార్ శిష్యుడని తెలుస్తుంది. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. ఎం ఎం క్రియేషన్స్ బ్యానర్ లో మొదటి సినిమాగా విజిత్ రావు ఈ మూవీని నిర్మించబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు