Kurukshetram: బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో ‘కురుక్షేత్రం’.. అంచనాలు పెంచుతున్న లేటెస్ట్ అప్డేట్
బాలయ్య - వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమాకు 'కురుక్షేత్రం(Kurukshetram)' అనే టైటిల్ ని ఫిక్స్ చేయనున్న మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : April 1, 2026 / 12:32 PM IST
Kurukshetram is The title of Balakrishna-Vivek Athreya movie
- బాలకృష్ణ ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్
- వివేక్ ఆత్రేయతో ‘కురుక్షేత్రం’ ఫిక్స్?
- అంచనాలు పెంచుతున్న క్రేజీ టైటిల్
Kurukshetram: నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చేసిన బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Inaya Sultana: వంపుసొంపులతో కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్న ఇనాయ.. అబ్బా ఏం ఫోజులు!
ఇదిలా ఉండగా, గోపీచంద్ మలినేని తరువాత బాలకృష్ణ ఓ కుర్ర దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు టాలీవుడ్ లో విభిన్నమైన కథాంశాలతో మెప్పించే యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఈ కాంబో ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే సుందరానికి, సరిపోదు శనివారం వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వివేక్ ఆత్రేయ, బాలయ్యను ఎలా చూపించబోతున్నారనే చర్చ మొదలైంది.
తాజాగా ఈ సినిమాకు ‘కురుక్షేత్రం(Kurukshetram)’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పేరు వినగానే ఇది మహాభారత నేపథ్యంతో కూడిన పౌరాణిక చిత్రం కావచ్చని కొందరు, లేదా నేటి కాలానికి తగ్గట్టుగా ఉండే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని మరికొందరు భావిస్తున్నారు. బాలయ్య మార్కు మాస్ డైలాగులు, వివేక్ ఆత్రేయ మార్కు టేకింగ్ తో ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ ‘కురుక్షేత్రం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
