Kushi fifth Single : ఖుషి ఐదో సాంగ్ ప్రొమో.. ‘ఓసి పెళ్లామా’ అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్‌.

Kushi fifth Single

Kushi Fifth Singe song promo : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ (Shiva Nirvana) ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంత (Samantha) హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోండ‌గా అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

iBomma : ఐబొమ్మలో సినిమాలు ఎవరు పెడతారు? ఐబొమ్మలో సినిమాలు చూడటం సేఫేనా?

టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా అద్భుత రెస్పాన్స్ వ‌చ్చింది. నాలుగు పాట‌ల‌ను రిలీజ్ చేయ‌గా పాపుల‌ర్ అయ్యాయి. ఈ క్ర‌మంలో ఐదో సాంగ్ ప్రొమోను తాజాగా విడుద‌ల చేసింది. ‘ఓసి పెళ్లామా’ అంటూ ఈ పాట సాగ‌నుంది. ఇక మొత్తం లిరిక‌ల్ పాట‌ను శ‌నివారం (ఆగ‌స్టు 26)న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ఈ పాట‌ను రాహుల్ సిప్లిగంజ్‌, సాకేత్ పాడారు. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించారు.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్.. ‘గ‌ణేష్ అంథెమ్’కి టైం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

జయరామ్, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో న‌టించిన ఈ సినిమా ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యు/ఏ(U/A) స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ర‌న్‌టైమ్ 2 గంట‌ల 45నిమిషాలు. ఈ చిత్రం ఖ‌చ్చితంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని సెన్సార్ స‌భ్యులు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. లైగ‌ర్ ప్లాప్ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా ఖ‌చ్చితంగా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిల‌వాల‌ని విజ‌య్ అభిమానులు కోరుకుంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు