KV Ramana Reddy : చరిత్ర సృష్టించిన ఆ ఎమ్మెల్యే.. సినిమాల మీద పిచ్చితో ఆడిషన్స్‌కి వెళ్లి..

తాజాగా KV రమణారెడ్డి వెయ్ దరువెయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.

KV Ramana Reddy : చరిత్ర సృష్టించిన ఆ ఎమ్మెల్యే.. సినిమాల మీద పిచ్చితో ఆడిషన్స్‌కి వెళ్లి..

KV Ramana Reddy Speech Vey Dharuvey Trailer Launch Event Goes Viral

KV Ramana Reddy : ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి లాంటి దిగ్గజాలని ఓడించి బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు KV రమణారెడ్డి. ఆ గెలుపు ఒక సంచలనంగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించడంతో KV రమణారెడ్డి దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అయితే తాజాగా KV రమణారెడ్డి ఓ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు.

సాయిరామ్ శంకర్(Sairam Shankar) హీరోగా చేస్తున్న ‘వెయ్ దరువెయ్'(Vey Daruvey) సినిమా మార్చ్ 15న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమా కామారెడ్డి నేపథ్యంలో తెరకెక్కించడంతో కామారెడ్డి ఎమ్మెల్యే KV రమణారెడ్డిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆయనతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా గెస్ట్ గా వచ్చారు.

ఈ ఈవెంట్లో KV రమణారెడ్డి మాట్లాడుతూ.. నేను చాలా సినిమా ప్రియుడ్ని. కేవలం సినిమాలు చూస్తాను కానీ వాటి వెనక ఏం ఉంటుందో నాకు ఏం తెలీదు. రెగ్యులర్ గా అన్ని సినిమాలు రిలీజ్ అయినవి చూస్తాను. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు చూడటం తగ్గించాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం ఇచ్చేది సినిమానే. మిగిలినవి అన్ని వ్యసనాలు కానీ సినిమా వ్యసనం కాదు. ఆ రెండున్నర గంటలు అన్ని మర్చిపోయి సినిమా చూస్తాం. నేనెప్పుడూ సినిమా ఈవెంట్స్ కి రాలేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ గారిని కలిసాను. ఇది రెండో ప్రోగ్రాం. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన సాయి రామ్ శంకర్ ఇప్పుడు మళ్ళీ వస్తూ మా కామారెడ్డి అబ్బాయిగా వస్తున్నారు. అందుకే ఈ ఈవెంట్ కి నన్ను పిలిచారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. సినిమా సక్సెస్ అయితే వెనక ఉండే వేలమంది కార్మికులకు సపోర్ట్ ఉంటుంది అని అన్నారు.

Also Read : Producer SKN : ‘అఖండ’ బాలయ్య గెటప్ లో నిర్మాత SKN.. ‘గామి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టేశాడుగా..

అలాగే.. నాకు కూడా సినిమాలంటే పిచ్చి. హరీష్, మాలాశ్రీ నటించిన ప్రేమఖైది సినిమాకి ఆడిషన్ కూడా ఇచ్చాను. అప్పట్లో సినిమాల్లోకి వద్దామనుకున్నాను. సెలెక్ట్ అయ్యాను కానీ ఫైనల్ ఆడిషన్స్ కి రావడం కుదరలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. చిన్నప్పట్నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. కానీ ఇలా రాజకీయాలలోకి వచ్చాను. లైఫ్ లో సక్సెస్ ఉంటేనే అందరూ చూస్తారు. నేను కనుక ఒకవేళ మంత్రి అయితే సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ తీసుకుంటాను అంటూ లైఫ్ గురించి, సక్సెస్ గురించి, సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో వెయ్ దరువెయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో KV రమణారెడ్డి స్పీచ్ వైరల్ గా మారింది.