Producer SKN : ‘అఖండ’ బాలయ్య గెటప్ లో నిర్మాత SKN.. ‘గామి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టేశాడుగా..

గామి ప్రీ రిలీజ్ ఈవెంట్లో SKN లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Producer SKN : ‘అఖండ’ బాలయ్య గెటప్ లో నిర్మాత SKN.. ‘గామి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదరగొట్టేశాడుగా..

Producer SKN Looks like Balakrishna Akhanda Getup in Gaami Pre Release Event Visuals goes Viral

Updated On : March 7, 2024 / 8:00 AM IST

Producer SKN : బేబీ సినిమాతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు శ్రీనివాస్ కుమార్(SKN). ప్రస్తుతం వరుస లవ్ స్టోరీ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నిన్న రాత్రి విశ్వక్ సేన్(Vishwak Sen) గామి(Gaami) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా రాగా నిర్మాత SKN కూడా గెస్ట్ గా వచ్చారు.

అయితే గామి ప్రీ రిలీజ్ ఈవెంట్లో SKN లుక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అఖండ సినిమాలో బాలయ్యలా మెడలో ఓ కండువా వేసుకొని, ఓ రుద్రాక్ష మాల వేసుకొని, రెండు చేతులకు తాళ్లు కట్టుకొని విభూది బొట్టు పెట్టుకొని వచ్చారు SKN. నడవడం కూడా బాలయ్యబాబులా ధీమాగా నడుస్తూ వచ్చారు. దీంతో గామి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత SKN విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. బాలయ్య అభిమానులు ఈ వీడియోల్ని తెగ షేర్ చేస్తున్నారు.

Also Read : Allu Arjun – Sneha : ప్రైవేట్‌గా అల్లు అర్జున్ – స్నేహ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్..

ఇక ఈ సినిమా ఈవెంట్లో SKN మాట్లాడుతూ.. హాలీవుడ్ లో ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాలు తీస్తున్నారు, మనమేమో ఇంట్లో సెల్లార్ లో తీసేస్తున్నాం. అలాంటప్పుడు గామి సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. వచ్చినప్పుడే ఎంకరేజ్ చేయాలి. ఆరు నెలలు సినిమా లేట్ అయితేనే కష్టం అనుకున్న వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో ఒక సినిమా కోసం 5 ఏళ్ళు టైం ఇవ్వడం అంటే విశ్వక్ నిజంగా గ్రేట్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో మన డివోషన్, ట్రెడిషన్ కూడా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అంటూ తన స్టైల్ లో ఎప్పటిలాగే కొన్ని పంచులు వేశారు.