Allu Arjun – Sneha : ప్రైవేట్‌గా అల్లు అర్జున్ – స్నేహ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్..
నిన్న అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల 13వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

Allu Arjun Sneha Celebrated Their Wedding Anniversary
Allu Arjun – Sneha : పుష్ప(Pushpa) సినిమా నేషనల్ వైడ్ హిట్ అవ్వడం, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం, పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉండటం.. ఇలా అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఓ పక్క పుష్ప 2 సినిమాతో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నారు. నిన్న అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల 13వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
నిన్న ఉదయమే స్నేహతో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి స్పెషల్ విషెష్ తెలిపారు బన్నీ. నిన్న రాత్రి స్నేహ స్పెషల్ గా తమ ఇంట్లోనే ప్రైవేట్ పార్టీ అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ పాటలతో స్పెషల్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసింది స్నేహ. ఆ పాటలు వింటూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఓ చిన్న వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Also Read : Jacqueline Fernandez : అర్ధరాత్రి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్..
అనంతరం అల్లు అర్జున్, స్నేహ, అయాన్, అర్హ.. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఇలా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసి వివాహ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసినందుకు స్నేహకి థ్యాంక్స్ చెప్పాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Allu Arjun & Allu Sneha Reddy celebrates 13years of togetherness…! #AlluArjun #AlluArjun? #AlluSnehaReddy #AlluSnehaReddyArjun13years pic.twitter.com/df4W0QJOZy
— Pooja Suniramana (@PoojaSuniramana) March 6, 2024
#AlluArjun
Ayan gadu be like :- food bale undi Tammudu ? pic.twitter.com/GIU3e6Cqvw— Deepak ?? (@Alludeepak_08) March 6, 2024