Jacqueline Fernandez : అర్ధరాత్రి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్..

బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.

Jacqueline Fernandez : అర్ధరాత్రి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్‌లో ఫైర్ యాక్సిడెంట్..

Fire Accident occurs at Jacqueline Fernandez Apartment in Mumbai news goes Viral

Updated On : March 7, 2024 / 7:07 AM IST

Jacqueline Fernandez : బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో నిన్న రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఐటెం సాంగ్స్ తో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం జాక్వెలిన్ ముంబై బాంద్రావెస్ట్ లో నౌరోజ్ హిల్ సొసైటీలో ఉన్న 17 స్టోరీ అపార్ట్మెంట్స్ లో ఓ ఖరీదైన 5 BHK ఫ్లాట్ కొనుక్కొని ఉంటుంది. గత సంవత్సరమే ఈ ఖరీదైన ఫ్లాట్ లోకి మారింది జాక్వెలిన్.

Also Read : Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. స‌చిన్‌, అక్ష‌య్‌, సూర్య‌ల‌తో క‌లిసి ‘నాటు నాటు’ స్టెప్పు

నిన్న అర్ధరాత్రి జాక్వెలిన్ ఉండే అపార్ట్మెంట్ లోని 14వ ఫ్లోర్ లోని ఓ వంటింట్లో మంటలు ఎగిసిపడ్డాయి. బయట నుంచి చూసిన కొంతమంది ఫైర్ ఇంజిన్ కి కాల్ చేయడంతో 4 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని సమాచారం. అయితే జాక్వెలిన్ ఇదే అపార్ట్మెంట్ లో 15వ ఫ్లోర్ లో ఉంటుంది. దీంతో జాక్వెలిన్ కి ఏమైనా అయిందా అంటూ అభిమానులు, నెటిజన్లు ఆరా తీయడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ వైరల్ గా మారింది. ఈ ఘటనలో జాక్వెలిన్ కి, ఆ ఇంట్లో ఉన్న వారికి కూడా ఏమి జరగలేదు అని సమాచారం.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)