NBK : బాలయ్య సినిమాలో లేడీ విలన్?
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు నందమూరి హీరో బాలకృష్ణ(NBK ).
- Thota Vamshi Kumar
- Updated on- July 24, 2026 / 09:59 AM IST
Lady villain in NBK Koratala Siva movie
NBK : బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. ఈ కాంబో మొదటిసారి కావడంతోనే ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. అందుకే సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
కాస్టింగ్ విషయంలో వస్తున్న ఒక గాసిప్ మరింత హైప్ తీసుకొస్తోంది. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా, పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుందట. కొరటాల శివ ఒక స్ట్రాంగ్ లేడీ విలన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని, ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌తో చర్చలు కూడా జరుగుతున్నాయన్న టాక్.
Bandla Ganesh : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంటికి బండ్ల గణేష్.. ఫోటోలు వైరల్..
ఇప్పటి వరకు హోమ్‌లీ, ఎమోషనల్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ ఇలా విలన్ షేడ్స్‌లో కనిపిస్తే అది ఆమె కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవడం ఖాయమంటున్నారు ఆడియన్స్. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు ఎదురుగా ఒక లేడీ విలన్ నిలబడటం అనేది టాలీవుడ్‌లో అరుదైన ఎక్స్‌పెరిమెంట్‌గా నిలవనుంది.
ఈ కాంబినేషన్ నిజమైతే థియేటర్లలో బాలయ్య, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ అవుతాయన్న ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఐశ్యర్య రాజేష్ రోల్‌పై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. కానీ బాలయ్య సినిమాలో లేడీ విలన్ అనే టాక్ మాత్రం సినిమా మీద ఆసక్తిని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తోంది.
