Nirosha Radha : ‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించింది ఎవరో తెలుసా? ఒకప్పటి స్టార్ హీరోయిన్..

లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ సరసన ఆయన భార్యగా సీనియర్ నటి నిరోషా రాధా నటించింది.

Lal Salaam Rajinikanth Wife Character Senior Actress Nirosha Radha Full Details

Nirosha Radha : రజినీకాంత్(Rajinikanth) ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాల్ సలామ్'(Lal Salaam) సినిమా నిన్న ఫిబ్రవరి 9న తమిళ్, తెలుగులో రిలీజయింది. విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా తమిళ్ ఫ్లేవర్ తో ఉండటంతో తెలుగులో అంతగా కనెక్ట్ అవ్వలేదు. తమిళ్ లో మాత్రం రజిని మేనియాతో నడిపిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొయినుద్దీన్ భాయ్ గా కనిపించాడు. ఇందులో రజినికి భార్యగా నటించింది ఎవరో తెలుసా?

లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ సరసన ఆయన భార్యగా సీనియర్ నటి నిరోషా రాధా నటించింది. ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా నిరోషా వెలిగింది. కన్నడ, మలయాళంలో కూడా పలు సినిమాలు చేసింది. తెలుగులో ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి, కొబ్బరిబొండం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నిరోషా తెలుగు, తమిళ్ లో సినిమాలే కాక సీరియల్స్ లో కూడా తల్లి, అత్త పాత్రలు చేస్తూ బిజీగానే ఉంది.

Also Read : Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ ఓటీటీలోకి.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?

ఇప్పుడు లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ సరసన భార్యగా, విక్రాంత్ కి తల్లిగా నటించి నిరోషా మెప్పించింది. రజినీకాంత్ తో పనిచేసిన అనుభవం గురించి, లాల్ సలామ్ సినిమా గురించి పలు ఫోటోలు షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది నిరోషా. మూడేళ్ళ తర్వాత లాల్ సలామ్ సినిమాతో నిరోషా తమిళ్ సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా తర్వాత నిరోషా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత బిజీ అవుతుందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు