Naa Saami Ranga : నాగార్జున ‘నా సామిరంగ’ ఓటీటీలోకి.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
నా సామిరంగ సినిమా విజయంపై ఇప్పటికే చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఇక సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తుండగా ఇప్పుడు నా సామిరంగ సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది.

Nagarjuna Naa Saami Ranga Movie OTT Streaming Date and Platform full Details
Naa Saami Ranga : నాగార్జున(Nagarjuna) హీరోగా వచ్చిన ‘నా సామిరంగ’ సినిమా సంక్రాంతికి వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ ముఖ్య పాత్రల్లో డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన నా సామిరంగ సినిమా సంక్రాంతికి సైలెంట్ గా వచ్చేసి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్స్ తెచ్చుకుంది.
నా సామిరంగ సినిమా విజయంపై ఇప్పటికే చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఇక సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తుండగా ఇప్పుడు నా సామిరంగ సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో నా సామిరంగ సినిమా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్స్ లో మిస్ అయిన ఈ పండగ సినిమాని ఓటీటీలో చూడటానికి సిద్దమయిపోతున్నారు ప్రేక్షకులు.
Also Read : Siddhu Jonnalagadda : డీజే టిల్లు బర్త్‌డే పార్టీలో మెరిసిన టాలీవుడ్ తారలు..
ఇక మరోవైపు సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, సైంధవ్ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హనుమాన్ సినిమా వచ్చే నెల నుంచి జీ5 లోకి రానుంది.
View this post on Instagram