Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందు వరుణ్ తేజ్‌కి లావణ్య పెట్టిన కండిషన్.. అదేంటో తెలుసా?
వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లావణ్య పెళ్ళికి ముందు వరుణ్ తేజ్‌కి ఒక కండిషన్ పెట్టిందట.
- gum 95921
- Published On : June 13, 2023 / 06:37 PM IST
Lavanya Tripathi conditions for Varun tej Gandeevadhari Arjuna
Varun Tej – Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో (Lavanya Tripathi) ఇటీవల నిశ్చితార్థం (Engagement) చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లో జూన్ 9న ఘనంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నిశ్చితార్థం కేవలం మెగా, అల్లు మరియు లావణ్య ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇక వీరిద్దరి ఈ ఏడాది చివరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇటలీలో ఈ వివాహ వేడుక జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Prabhas : ప్రభాస్, మారుతి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్!
కాగా పెళ్ళికి ముందు వరుణ్ తేజ్‌కి లావణ్య ఒక కండిషన్ పెట్టిందట. లావణ్య కుటుంబం క్లాసికల్ డాన్సర్స్ బ్యాక్‌డ్రాప్. దీంతో లావణ్య కూడా చిన్నప్పుడే భరతనాట్యం (Bharatnatyam) నేర్చుకుంది. దాని పై ఎంతో ప్రేమ కూడా పెంచుకుంది. ఇక పెళ్లి తరువాత ఎక్కడైనా స్టేజి పై భరతనాట్యం చేసే అవకాశం వస్తే అసలు వదులుకోను అని లావణ్య తేల్చి చెప్పేసిందట. అలాగే మ్యారేజ్ తరువాత సినిమాల్లో నటించకపోయినా, ప్రొడక్షన్ వైపు వెళ్తానని చెప్పిందట. వీటన్నిటికీ వరుణ్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారని సమాచారం.
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఆగష్టు 25న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా నటిస్తుంది. బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
