Lavanya Tripathi : ఆ ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు.. నా ఫ్యామిలీని ఎవరైనా అంటే..
ఇటీవల లావణ్య చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.(Lavanya Tripathi)
- Saketh U
- Updated on- February 12, 2026 / 08:20 AM IST
Lavanya Tripathi
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటుంది. బయట కూడా సినిమా ప్రమోషన్స్ లో తప్ప ఎక్కువగా కనిపించదు. ఇక వరుణ్ తేజ్ తో పెళ్లి, బాబు పుట్టాక బయట అసలు కనిపించట్లేదు. అయితే ఇటీవల లావణ్య చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.(Lavanya Tripathi)
రామ చరణ్ కి ఇటీవల ట్విన్స్ పుట్టిన సంగతి తెలిసిందే. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చిరంజీవిని ఉద్దేశిస్తూ మహిళలకు విలువ ఇవ్వరు అని, మనవరాళ్లను సరిగ్గా చూడరు అని విమర్శలు చేసారు. ఇలాంటి నెగిటివ్ ట్వీట్ ఓ వ్యక్తి వేయగా దానికి లావణ్య అసలు చిరంజీవి గారు మమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? ఆయన చేసిన దాంట్లో కొంచెం కూడా బయట చాలా మంది చేయరు. ఒక ఫ్యామిలీ మంచి ఆనందసమయంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఏమి తెలియకుండా ఇలా అంటావా అని ఫైర్ అయ్యారు. అసలు ఎప్పుడూ లేనిది లావణ్య ఫైర్ అవుతూ ట్వీట్ చేయడంతో వార్తల్లో నిలిచింది.
Also Read : Anchor Sravanthi : పాపం స్రవంతి.. పెళ్లయింది అని చెప్పడంతో.. తమిళ్ స్టార్ నటుడు కొడుకు..
లావణ్య త్రిపాఠి సతీ లీలావతి సినిమా ప్రెస్ మీట్ తాజాగా జరగ్గా ఈ ఈవెంట్లో ఆ ట్వీట్ గురించి ప్రశ్న రాగా స్పందించింది.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. నా లైఫ్ లో మంచి అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అందరూ నాకు సపోర్ట్ చేసారు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ ట్వీట్ గురించి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు అలాంటి ట్వీట్స్ ఎందుకు? అది అవసరమా. అది బ్యాడ్ ట్వీట్. ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఎవరైనా అంటే నాకు నచ్చదు, నేను ఊరుకోను అని తెలిపింది. దీంతో కోడలిగా మెగా ఫ్యామిలీకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటూ లావణ్యని అభినందిస్తూ ఆమె కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : Vijay Rashmika : విజయ్ – రష్మిక పెళ్లితో పాటు రిసెప్షన్ డేట్ కూడా ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ?
లావణ్య అలా ఫైర్ అవుతూ ట్వీట్ చేయడంతో ఆ నెటిజన్ తన ట్వీట్ ని డిలీట్ చేసేసాడు. లావణ్య చేసిన ట్వీట్ ఇదే..
