Lavanya Tripathi : ప్రగ్నెన్సీతో లావణ్య చేసిన సినిమా.. బాబు పుట్టిన తర్వాత రిలీజ్..
Lavanya Tripathi
- Saketh U
- Published On : February 12, 2026 / 06:17 PM IST
Lavanya Tripathi
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే కొన్ని నెలల క్రితమే పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్స్ పై నాగ మోహన్ నిర్మాణంలో తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సతీ లీలావతి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సతీ లీలావతి సినిమా మార్చి 6న రిలీజ్ కానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.(Lavanya Tripathi)
ఈ ప్రెస్ మీట్ లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. సతీ లీలావతి ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ పూర్తిచేయగలిగాను. ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ సినిమా. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుందని తెలిపింది.
Also Read : The Paradise: ఇట్స్ అఫీషియల్.. ‘ది ప్యారడైజ్’ మూవీ వాయిదా.. ఏకంగా నాలుగు నెలలు వెనక్కి
దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ.. కమల్ హాసన్ గారు చేసిన సతీ లీలావతితో నా సినిమాని పోల్చను కానీ అందరూ రిలీట్ అయ్యేలా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీసాను అని అన్నారు. నిర్మాత నాగ మోహన్ మాట్లాడుతూ.. నిర్మాతగా నాకు ఇది మొదటి సినిమా. ఈ సినిమా ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నాను అని అన్నారు. కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ.. పాత సతీ లీలావతి ఎంత పెద్ద హిట్ అయిందో మా ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది అని అన్నారు.
