Lavanya Tripathi: కాస్టింగ్ కౌచ్ వివాదంపై లావణ్య త్రిపాఠి రియాక్షన్.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు?
కాస్టింగ్ కౌచ్ పై మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల షాకింగ్ కామెంట్స్(Lavanya Tripathi).
- V Santhosh Kumar
- Published On : March 15, 2026 / 09:15 AM IST
Lavanya Tripathi Shocking Comments on the Casting Couch
- తమిళ దర్శకుడితో చేదు అనుభవం
- సినిమా నుంచి తప్పుకున్న లావణ్య
- నన్ను టార్గెట్ చేశారు అంటూ ఎమోషనల్ కామెంట్స్
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి సినీ పరిశ్రమలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి సంచలన కామెంట్స్ చేసింది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే లావణ్య, మొదటిసారి తన కెరీర్‌లో ఎదుర్కొన్న వేధింపుల గురించి నోరు విప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Krithi Shetty: గ్లామర్ డోస్ పెంచిన బేబమ్మ.. బ్లాక్ డ్రెస్సులో అందం కెవ్వు కేక.. ఫొటోలు
గతంలో ఆమె చేసిన ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది లావణ్య(Lavanya Tripathi).. “కరోనా టైంలో నేను ఒక తమిళ సినిమా ఒప్పుకున్నాను. కానీ, ఆ చిత్ర దర్శకుడి ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదు. అక్కడ నాకు రక్షణ లేదని, అసౌకర్యంగా అనిపించడంతో ధైర్యంగా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. అయితే, సినిమా వదులుకున్న తర్వాత సదరు దర్శకనిర్మాతలు నన్ను టార్గెట్ చేశారు. పత్రికల్లో తప్పుడు కథనాలు రాయించడమే కాకుండా కేసులు కూడా పెట్టారు.ఆ క్లిష్ట సమయంలో నాకు ఎవరూ మద్దతుగా నిలవలేదు.
ఏం చేయాలో తెలియక ఎంతో మానసిక వేదన అనుభవించాను”అంటూ ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. దీంతో, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, మెగా హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి తరువాత లావణ్య నటిస్తున్న తొలి చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజానికి, ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
