Lavi Pajni : మా సినిమా నాకే నచ్చలేదు.. ‘ఆదిపురుష్’పై కుంభకర్ణ పాత్ర చేసిన నటుడు వ్యాఖ్యలు..

తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్ర చేసిన నటుడు లావీపజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామాయణంలో కుంభకర్ణ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది.

Lavi Pajni sensational comments on Adipurush Movie

Adipurush :  ప్రభాస్(Prabhas) రాముడిగా ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్ రిలీజ్ రోజు నుంచే దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. రామాయణాన్ని, అందులో పాత్రల స్వరూపాలని, డైలాగ్స్ ని ఇష్టమొచ్చినట్టు మార్చేసి రాయడంతో డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా దారుణంగా ట్రోల్ చేశారు. సినిమా పూర్తిగా వివాదాలమయంగా నిలిచింది.

ఈ సినిమాని సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్ర చేసిన నటుడు లావీపజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామాయణంలో కుంభకర్ణ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. కుంభకర్ణుడు ఒక అసాధారణమైన వీరుడు. భారీ కాయంతో యుద్ధ భూమిలో అందర్నీ భయపెట్టాడు. రాముడు ఎంతో కష్టపడి కుంభకర్ణుడిని పడగొట్టాడు. కానీ ఆదిపురుష్ సినిమాలో అసలు ఈ పాత్రకు ప్రాముఖ్యత లేదు. సినిమా మొత్తంలో కనీసం ఒక 5 నిముషాలు కూడా కనిపించడు. సినిమాలో కుంభకర్ణుడు నిద్రలేచి వచ్చి హనుమంతుడితో ఫైట్ చేసి, రాముడు బాణాలు వేయగానే పడిపోతాడు. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ క్యారెక్టర్. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి.

తాజాగా ఆదిపురుష్ సినిమాలో కుంభకర్ణ పాత్ర చేసిన లావీపజ్నీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఇన్ని వివాదాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాలోని వివాదాస్పద డైలాగ్స్ తొలగించినప్పటికీ.. ఒక హిందువుగా ఆ డైలాగ్స్ విషయంలో నేను కూడా బాధపడ్డాను. నా పాత్ర కూడా చాలా కొద్దిసేపే ఉంటుంది. నేను నటించిన సినిమా అయినప్పటికీ కొన్ని విషయాల్లో నాకు కూడా నచ్చలేదు అని కామెంట్స్ చేశాడు. దీంతో లావీపజ్నీ చేసినవ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Rakesh Master : రాకేష్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేసిన మామయ్య.. నాకు ఆస్తులు అవసర్లేదు, అభిమానం చాలు..

ఇక ఆదిపురుష్ సినిమా రిలీజయి 12 రోజులు అవుతుండగా కలెక్షన్స్ పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. కనీసం 500 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. చాలా చోట్ల ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని సమాచారం. ఆదిపురుష్ రిజల్ట్ తో ప్రభాస్ అభిమానులు నిరాశలో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు