వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ టీజర్ రిలీజ్.
హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ మెయిన్ లీడ్‌గా, ఎక్స్ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి సమర్పణలో, ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సినిమా.. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ.. కిషోర్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు పాపా నీకేదంటే ఇష్టం అనే సాంగ్‌ని రిలీజ్ చేసిన మూవీ యూనిట్, ఇప్పుడు వేర్ ఈజ్ ది వెంటలక్ష్మీ టీజర్ రిలీజ్ చేసింది. వెంకటలక్ష్మీ అదేనండీ, రాయ్ లక్ష్మీ నాభి అందాల ప్రదర్శనతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. బ్లాక్ శారీలో రాయ్ అందాలు చూస్తే వావ్ అనాల్సిందే. తలస్నానం చేసి, తల ఆరబెట్టుకుంటూ, అందాలు ప్రదర్శించడమే టీజర్‌గా కట్ చేసారు.
చేత్తో తల తుడుచుకుంటూ, కెమెరా వైపు తిరిగి, రాయ్ మత్తుగా, గమ్మత్తుగా చూసిన చూపు.. కుర్ర హృదయాల్లోకి భామ బాణాల్లా దూసుకెళ్ళాయి. ప్రవీణ్, మధు కీ రోల్స్ చేసిన ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిరణ్, కెమెరా : వెంకట్, ఎడిటింగ్ : ఎస్ఆర్ శేఖర్, సంగీతం : హరిగౌర, ఆర్ట్ : బ్రహ్మ కడలి, నిర్మాతలు : ఎమ్.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి మరియు ఆర్‌కె రెడ్డి.
వాచ్ టీజర్…