×
Ad

Prashanth Neel: నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేశాడు.. స్టార్ డైరెక్టర్ వైఫ్ అలా అందేంటి..!

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. (Prashanth Neel)కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు కేజీఎఫ్ 2తో రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు.

Likhita made an interesting post about her husband Prashant Neel

Prashanth Neel: కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు కేజీఎఫ్ 2తో రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టి కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఆ తరువాత ప్రభాస్ తో చేసిన సలార్ సైతం భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో పాన్ వరల్డ్ మూవీ డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో(Prashanth Neel) ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రశాంత్ నీల్ సినిమాల్లో కరక్ట్ గా గమనిస్తే ఆయన సినిమాలన్నీ ఎక్కువగా నలుపు రంగులో ఉంటాయి.

Rukmini Vasanth: వైలెట్ కలర్ డ్రెస్ లో వయ్యారి భామలా.. రుక్మిణి క్యూట్ ఫోటోలు

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సాలార్, ఇప్పుడు రాబోతున్న డ్రాగన్ అన్ని సినిమాలు కూడా నల్లగానే ఉంటాయి. అలాగే ఆయన కూడా ఎక్కువగా నలుపు దుస్తువులనే ధరించడానికి ఇష్టపడతారు. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ వద్ద ప్రస్తావించగా తనకు బ్లాక్ ఓసీడీ ఉన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా ఆయన తెలుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. ఇటీవల ఆయన ఒక ఫ్యామిలీ ఫస్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ పట్టు దుస్తులు ధరించాడు. చాలా కాలం తరువాత తెల్ల బట్టలు ధరించడంతో ప్రశాంత్ నీల్ భార్య లిఖితా వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకి “ఫైనల్ నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేసుకున్నాడు” అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో లిఖితా సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.