ఈ హీరోయిన్ల హ్యాండ్‌బ్యాగ్స్ రేట్‌తో కార్ కొనొచ్చు తెలుసా!

ఈ హీరోయిన్ల హ్యాండ్‌బ్యాగ్స్ రేట్‌తో కార్ కొనొచ్చు తెలుసా!

Updated On : January 17, 2021 / 6:58 PM IST

Celebrities HandBags: స్టార్ సెలబ్రెటీలు ఏం చేసినా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే.. ఏది కొన్నా అది న్యూస్ అవ్వాల్సిందే.. ఈ మధ్య స్టార్ హీరోయిన్ల హ్యాండ్ బ్యాగులు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. కాస్ట్ డిజైన్.. స్పెషల్ ఫ్యూచర్స్ అంటూ.. ఆ బ్యాగ్‌ల గురించి తెలుసుకోవడాకి సోషల్ మీడియా జనాలు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఈ మధ్య స్టార్ హీరోయిన్లు హ్యాండ్ బ్యాగ్‌లతో ట్రెండింగ్‌లో ఉంటున్నారు. కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్‌లు వాడుతూ.. న్యూస్ ఐటమ్స్ అవుతున్నారు. రీసెంట్‌గా సమంత ఎయిర్‌పోర్ట్‌లో వేసుకున్న బ్యాగ్ అందరినీ ఆకర్షిస్తోంది. అందరి కళ్లు ఆమె దగ్గరున్న వస్తువుల వైపు వెళ్ళాయి. ఎప్పుడూ అప్‌డేట్ అవుతూ.. సరికొత్త స్టైల్స్‌ను ఫాలో అయ్యే సమంత చేతిలో ఉన్న ఆ మోనోగ్రామ్ బ్యాగ్ రేటు ఏకంగా 2 లక్షల 20 వేలు. సమంత వేసుకున్న డ్రెస్ పది వేలే అయినా.. ఆమె సూట్ కేసు రేటు లక్షా 80 వేలు పైనే. ఒక్క బ్యాగ్‌తో సోషల్ మీడియాలో సమంత తెగ వైరల్ అయ్యింది.

Akkineni Samantha

 

ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఫాలో అయ్యే ట్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లక్షల ఖరీదు చేసే వస్తువులను ఎప్పుడూ వెంటేసుకుని తిరుగుతుంటారు. బ్యాగ్ కలెక్షన్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది దీపికా పదుకోన్. ఆ మధ్య భర్తతో కలిసి రాజస్థాన్ వెళ్లినప్పుడు దీపికా బ్యాగ్ నెటిజన్లను ఆకర్షించింది.

Deepika Padukone

బొట్టెగా వెనెటా చైన్ క్యాసెట్ కంపెనీకి చెందిన ఈ బ్యాగ్ అక్షరాలా 3 లక్షలు. ఇక బ్రాండ్ వస్తువులు వాడటంతో కరీనా కపూర్ స్టైలే వేరు. ఆమె ఈ మధ్య తన కొడుకు తైమూర్ బర్త్‌డే పార్టీలో కరీనా వేసకున్న బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ బ్యాగ్ కాస్ట్ అక్షరాలా నాలుగు లక్షలు.

Kareena Kapoor Khan ఇక బాలీవుడ్, టాలీవుడ్ యంగ్ తరంగ్.. కియారా అద్వాని కూడా తన హ్యాండ్ బ్యాగ్ న్యూస్‌తో వైరల్ అయ్యింది. ఆ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా.. వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోయింది కియారా.. దానికి మ్యాచింగ్ బ్యాగ్‌ను 3 లక్షల 70 వేలు పెట్టి ఇష్టంగా కొనుక్కుంది కియారా.. దాంతో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. అప్పట్లో హీరోయిన్లు డ్రెస్‌లు వాటికి పెట్టిన కాస్ట్‌లు నెటిజన్లను ఔరా అనిపిస్తే.. ఇప్పుడు బ్యాగ్‌ల వంతు వచ్చింది.

Kiara Adwani