×
Ad

MAA Elections: సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. ముగిసిన జనరల్‌ బాడీ మీటింగ్!

'మా' ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా అర్థం అవుతోంది. పెద్దలు జోక్యం చేసుకుని వర్చువల్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించుకున్నారు.

  • Published On : July 29, 2021 / 10:04 PM IST

K Raju

MAA Elections: ‘మా’ ఎన్నికల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా అర్థం అవుతోంది. పెద్దలు జోక్యం చేసుకుని వర్చువల్‌గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించుకుని, రెండు గంటలపాటు సుధీర్ఘ చర్చలు సాగించిన తర్వాత మా ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణంరాజు, మురళి మోహన్, మోహన్ బాబు, శివకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ మీటింగ్‌లో సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఆగస్టు 22న ‘మా’ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చెయ్యలని నిర్ణయం తీసుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ తర్వాతే, ఎన్నికలపై ప్రకటన ఉండవచ్చు. ఈ సమావేశంలో ఏకగ్రీవంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మురళీమోహన్ కూడా ఏకగ్రీవం అయ్యేలా చూస్తామంటూ ప్రకటించారు. అంతకుముందు ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజుకు కూడా సభ్యులు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఇప్పటికే ముగియగా.. ఎన్నికలు నిర్వహించాలని లేఖల్లో కోరారు సభ్యులు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు పోటీ చేయాలని బావిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎవరికి వారు ప్యానెల్‌ ఏర్పాటు చేసుకుంటూ.. సీనియర్ల మద్దతు కూడగట్టే పనిలో కూడా ఉన్నారు.