Maa Oori Polimera 2 Teaser : మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్.. రక్తంతో అభిషేకం చేసుకున్న సత్యం రాజేష్..
మా ఊరి పొలిమేర సక్సెస్ అవ్వడంతో మా ఊరి పొలిమేర 2 తీశారు. తాజాగా మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.
- Saketh U
- Published On : June 30, 2023 / 06:24 PM IST
Maa Oori Polimera 2 Teaser released by varun teja
Maa Oori Polimera 2 Teaser : సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో 2021లో వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజయింది. ఈ సినిమాకి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఓటీటీలో బాగా సక్సెస్ అయింది ఈ సినిమా.
మా ఊరి పొలిమేర సక్సెస్ అవ్వడంతో మా ఊరి పొలిమేర 2 తీశారు. అదే కాస్ట్ అండ్ క్రూతో ఈ సినిమాని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పార్ట్ 2 ప్రకటించడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు.
ఇక టీజర్ లో ఎక్కువగా కథ అర్థమయ్యేలా చూపించలేదు. దీంట్లో కూడా చేతబడులు ఉంటాయని తెలుస్తుంది. చంపితే తప్పు కానీ బలి ఇస్తే తప్పేంటి అనే డైలాగ్ ఒక్కటి పెట్టారు. చివర్లో సత్యం రాజేష్ చేతబడి చేస్తూ రక్తంతో అభిషేకం చేసుకోవడం చూపించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సారి ఓటీటీ కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
