Mahesh Babu : రేవంత్ రెడ్డికి సూపర్ స్టార్ అభినందనలు.. స్పెషల్ ట్వీట్ తో..

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహేష్ తన ట్వీట్ లో..

Mahesh Babu : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోగవర్నర్ తమిళిసై సమక్షంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రమాణం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలు, భారీ ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాల ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, నిఖిల్.. మరికొంతమంది సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

Also Read : Ted Sarandos with NTR & Charan : మెగా నందమూరి ఫ్యామిలీలతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. ఫొటోలు

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మహేష్ తన ట్వీట్ లో.. తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారగా పలువురు రేవంత్ అభిమానులు మహేష్ కి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు