Kurchi MadathaPetti : అమెరికాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ హవా చూశారా? నేషనల్ గేమ్స్ మధ్యలో..

కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియా, యూట్యూబ్ తో బాగా వైరల్ అయింది. ఇప్పటికే ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని తెగ వాడేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ పాట అమెరికా దాకా పాకింది.

Kurchi MadathaPetti : అమెరికాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ హవా చూశారా? నేషనల్ గేమ్స్ మధ్యలో..

Mahesh Babu Guntur Kaaram Kurchi MadathaPetti Song Dance in Houston during the NBA game halftime

Kurchi MadathaPetti Song : మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ కాంబోలో ఇటీవల సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల మన సినిమాలు, పాటలు ప్రపంచమంతా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కూడా వైరల్ అవుతుంది. మహేష్, శ్రీలీల(Sreeleela) ఈ సాంగ్ లో మాస్ స్టెప్పులు వేయడంతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.

కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియా, యూట్యూబ్ తో బాగా వైరల్ అయింది. ఇప్పటికే ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని తెగ వాడేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ పాట అమెరికా దాకా పాకింది. అమెరికాలో కూడా కుర్చీ మడతబెట్టేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా(America) హూస్టన్ లో నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ జరుగుతున్నాయి.

Also Read : Sri Divya : ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేష్ బాబు సినిమాలో చేసిందని తెలుసా? నేడు బర్త్‌డే కూడా..

ఈ గేమ్స్ మధ్యలో బ్రేక్ టైంలో పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ఓ గేమ్ మధ్యలో ఇలా పలువురు అమెరికన్స్ కుర్చీ మడతపెట్టి సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసి అలరించారు. ఇంకేముంది ఈ వీడియో వైరల్ గా మారింది. గుంటూరు కారం మూవీ యూనిట్ తమ సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఇక మహేష్ అభిమానులు అయితే ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ కూడా నాటు నాటు లాగే మరింత వైరల్ అవుతుందని మహేష్ అభిమానులు అంటున్నారు.