Sri Divya : ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేష్ బాబు సినిమాలో చేసిందని తెలుసా? నేడు బర్త్‌డే కూడా..

నేడు శ్రీవిద్య పుట్టిన రోజు కావడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Sri Divya : ఈ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేష్ బాబు సినిమాలో చేసిందని తెలుసా? నేడు బర్త్‌డే కూడా..

Do You Know Actress Sri Divya Acted with Mahesh Bbau as Child Artist Photo goes Viral on Her Birthday

Updated On : April 1, 2024 / 10:21 AM IST

Sri Divya : చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా. హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. వీళ్లంతా చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు స్టార్ హీరోలందరి సినిమాల్లో చేసేసారు. ఉదాహరణకు ఇటీవల హనుమాన్ తో హిట్ కొట్టిన తేజ సజ్జ ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసాడు. ఇదే కోవలోకి హీరోయిన్ శ్రీ దివ్య కూడా వస్తుంది.

‘మనసారా’ సినిమాతో తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బస్ స్టాప్, కేరింత.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించి ఇప్పుడు తమిళ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అయితే ఈ తెలుగమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలు చేసింది. హనుమాన్ జంక్షన్, వీడే, యువరాజు.. లాంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. యువరాజు సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించింది.

Also Read : Mrunal – Rashmika : ఇటు మృణాల్ నో డబ్బింగ్.. అటు రష్మిక అన్ని భాషల్లో డబ్బింగ్..

నేడు శ్రీదివ్య పుట్టిన రోజు కావడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు, నెటిజన్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మహేష్ అభిమానులు ఆమె చిన్నప్పుడు మహేష్ తో ఉన్న ఫోటో షేర్ చేసి మరీ విషెష్ చెప్తుండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.