Mrunal – Rashmika : ఇటు మృణాల్ నో డబ్బింగ్.. అటు రష్మిక అన్ని భాషల్లో డబ్బింగ్..

టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ముందు వరసలో ఉంటారు.

Mrunal – Rashmika : ఇటు మృణాల్ నో డబ్బింగ్.. అటు రష్మిక అన్ని భాషల్లో డబ్బింగ్..

Mrunal Thakur Rashmika Mandanna Movies Family Star The Girl Friend Dubbing Updates

Mrunal Thakur – Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ముందు వరసలో ఉంటారు. రష్మిక ఎప్పుడో వచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసేస్తోంది. ఇక మృణాల్ ఠాకూర్ వచ్చిన తక్కువ టైంలోనే, రెండు సినిమాలతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. వేరే భాషల్లో హీరోయిన్స్ మన తెలుగులో అంత తొందరగా డబ్బింగ్ చెప్పరు.

మృణాల్ ఠాకూర్ ఇటీవల కష్టపడి తెలుగు నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయింది. మృణాల్ రెండు తెలుగు సినిమాలు సీతారామం, హాయ్ నాన్నకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మూడో సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star)కి తనే స్వంతంగా డబ్బింగ్ చెప్తుంది అని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్దామనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. లాస్ట్ మినిట్ వరకు షూట్ జరగడం, రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేయడం, నేను ప్రమోషన్స్ లో పాల్గొనడం వల్ల నా డబ్బింగ్ కి టైం కేటాయించలేక వేరే వాళ్ళతో చెప్పించేసారు. త్వరలో హిందీ వర్షన్ రిలీజ్ అవుతుంది. దానికి మాత్రం నేనే డబ్బింగ్ చెప్తాను. తెలుగులో కూడా నెక్స్ట్ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను అని తెలిపింది.

Also Read : SSMB 29 : మహేష్ రాజమౌళి సినిమా కథ ఆ బుక్స్ నుంచి తీసుకొని రాశారా? విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వైరల్..

ఇక మరోవైపు రష్మిక మందన్న అయిదు భాషల్లో డబ్బింగ్ చెప్పబోతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Friend) అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రష్మిక నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఏప్రిల్ 5న రష్మిక పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ టీజర్ కోసం రష్మిక తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మళయాలం భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్తుందని సమాచారం. సినిమాకు కూడా అన్ని భాషల్లో తనే సొంతంగా డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తుందని సమాచారం.