×
Ad

Mahesh Babu : రాజమౌళి ఒక సంవత్సరం వరకు నాకు ఏం చెప్పలేదు.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్..

రాజమౌళి హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. (Mahesh Babu)

  • Published On : February 4, 2026 / 08:05 AM IST

Mahesh Babu

Mahesh Babu : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వారణాసి సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని రాజమౌళి హాలీవుడ్ టార్గెట్ పెట్టుకొని రిలీజ్ చేయబోతున్నాడు.(Mahesh Babu)

దాంతో రాజమౌళి హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. వారణాసి గ్లింప్స్ రిలీజయిన సమయంలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ హాలీవుడ్ లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఆ ఇంటర్వ్యూ రిలీజవ్వగా అందులో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : Priyanka Chopra : ‘వారణాసి’లో బాబుతో ప్రియాంక డ్యాన్స్.. హాలీవుడ్ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా కామెంట్స్ వైరల్..

ఈ క్రమంలో మహేష్ బాబు ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయిందో తెలిపారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. అంతకు ముందు ఎప్పుడూ రాజమౌళి నాతో స్టోరీ గురించి డిస్కస్ చేయలేదు. 15 ఏళ్లుగా మేము కలిసి పనిచేయాలని అనుకుంటున్నాము. RRR తర్వాత కూడా ఒక సంవత్సరం వరకు నాకు ఏమి చెప్పలేదు. RRR రిలీజయిన ఒక సంవత్సరం తర్వాత నన్ను ఆయన ఆఫీస్ కి పిలిచి ఈ స్క్రిప్ట్ నాకు నేరేట్ చేసారు.

నేను ఆశ్చర్యపోయాను ఈ కథ విని. ఈ మొత్తం కథలో యాక్షన్, అడ్వెంచరస్, మైథలాజి, టైం ట్రావెల్ ఇవన్నీ ఉన్నాయి. నేను రాజమౌళికి బిగ్ ఫ్యాన్. ఇలాంటి సినిమాలో ఆయన దర్శకత్వంలో నేను నటించడం ఆనందంగా ఉంది. రాజమౌళి నన్ను ఈ సినిమా ప్రాసెస్ లోకి తీసుకెళ్లాడు అని తెలిపారు.

Also Read : Mahesh Babu : ట్రైనింగ్ ఇప్పించి మరీ రాజమౌళి నా రన్నింగ్ స్టైల్ మార్చేశారు.. మహేష్ వ్యాఖ్యలు వైరల్.. అసలు బాబుకి అదే హైలెట్ కదా..