Varanasi: కృష్ణ బర్త్ డేకి ‘శ్రీరాముడి’ లుక్.. ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్ ప్లాన్ చేస్తున్న జక్కన్న
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా వారణాసి(Varanasi) సినిమా నుంచి స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసిన రాజమౌళి.
Mahesh Babu Lord Rama look from Varanasi movie release on Krishna birthday
- మహేష్ బాబు ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్
- కృష్ణ బర్త్ డేకి మహేష్ బాబు శ్రీరాముడి లుక్ రివీల్
- త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). సుమారు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని, ఈ మూవీ నుండి ఒక భారీ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబును ‘శ్రీరాముడి’ గా పవర్ఫుల్ లుక్‌లో ఈ సందర్భంగా పరిచయం చేయనున్నట్లు సమాచారం.
Nayan- Vignesh Shivan: తిరుమలలో నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు.. ఫొటోలు వైరల్
ఈ చిత్రం కేవలం ఒక అడ్వెంచర్ డ్రామా మాత్రమే కాకుండా, పురాణాలను, సైన్స్ ఫిక్షన్‌ను మేళవించిన టైమ్ ట్రావెల్ కథాంశంతో సాగనుంది. ఇందులో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శివ భక్తుడి పాత్రలో కనిపిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మల్టీవర్స్, వివిధ కాలాల్లో (యుగాల్లో) సాగే ఈ ప్రయాణం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించగా, కృష్ణ గారి బర్త్ డే నాటి అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇక వారణాసి రిలీజ్ విషయానికి వస్తే, వచ్చే ఏడాది అంటే 2027, ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఏడాది ముందు నుండే సినిమాపై హైప్ పెంచేలా ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి మార్క్ విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మల్టీ లాంగ్వేజెస్ లో గ్లోబల్ లెవల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
