Mahesh Babu : తన పెంపుడు కుక్క చనిపోయిందని మహేష్ ఎమోషనల్ పోస్ట్..
మహేష్ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు(Dog) ఉన్నాయి. అందులో ప్లూటో(Pluto) అనే కుక్క ఒకటి. తాజాగా మహేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
- Saketh U
- Published On : August 18, 2023 / 07:57 AM IST
Mahesh Babu pet dog Pluto Passed away emotional post on social media by Mahesh Babu Namrata and Sitara
Mahesh Babu : మహేష్ బాబు ఇన్ని రోజులు ఫారిన్ లో ఎంజాయ్ చేసి ఇటీవలే ఇండియాకు వచ్చి గుంటూరు కారం”(Guntur Kaaram) షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మహేష్ సోషల్ మీడియాలో చాలా రేర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా మహేష్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
మహేష్ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు(Dog) ఉన్నాయి. అందులో ప్లూటో(Pluto) అనే కుక్క ఒకటి. ప్లూటో చనిపోయిందని మహేష్ భార్య నమ్రత(Namrata) తన సోషల్ మీడియాలో తెలిపింది. ప్లూటోని చాలా మిస్ అవుతున్నాం అంటూ ఎమోషనల్ గా పోస్టు చేసింది. ఇక సితార(Sitara) కూడా ప్లూటో ఫోటోని షేర్ చేసి ఏడు ఏళ్లుగా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. చాలా మిస్ అవుతున్నాను అని పోస్ట్ చేసింది. మహేష్ కూడా తన పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న పాత ఫోటోని షేర్ చేసి లవ్ సింబల్స్ పోస్ట్ చేసాడు.
దీంతో మహేష్ అభిమానులు బాధపడకండి, స్ట్రాంగ్ గా ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ ఇలా కుక్కతో ఉన్న ఫోటో పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
