Mahesh Babu : మహేష్ బాబు మూవీ టైటిల్ చెప్పిన సందీప్ వంగా.. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్..

మహేష్ బాబుతో సందీప్ వంగా చేయాల్సిన సినిమా టైటిల్ ఏంటో తెలుసా..? ఆ మూవీలోని హీరో పాత్ర..

Mahesh Babu Sandeep Reddy Vanga movie title and updates

Mahesh Babu : అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన ‘యానిమల్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేష్ బాబు అభిమానులు తెగ బాధ పడుతున్నారు. ఎందుకంటే.. సందీప్ వంగా, మహేష్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అది పక్కన పెట్టేసి సందీప్ యానిమల్ మూవీని తెరకెక్కించారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సందీప్ వంగా, మహేష్ కి చెప్పింది యానిమల్ స్టోరీనే అని, అయితే మహేష్ దానిని రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు.

దీంతో మహేష్ అభిమానులు.. ఇలాంటి సినిమాని ఎలా రిజెక్ట్ చేశావు అన్నా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ రిజెక్ట్ చేసింది అసలు ఈ కథేనా..? కదా..? అని ఒక సందేహం నెలకుంది. తాజాగా హైదరాబాద్ లో యానిమల్ మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ విషయం గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి సందీప్ వంగా బదులిస్తూ.. “మహేష్ బాబుకి చెప్పింది వేరే కథ. ఆ సినిమా పేరు డెవిల్. అది కూడా కొంచెం యానిమల్ తరహాలోనే ఉంటుంది. ఆ మూవీలోని హీరో పాత్ర యానిమల్ హీరో పాత్ర కంటే వైల్డ్ గా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Animal Movie : యానిమల్ మూవీలో చూపించిన.. భారీ మెషిన్ గన్‌ని నిజంగా తయారు చేశారు

ఆ సినిమాని మహేష్ బాబు రిజెక్ట్ చేయలేదట. కొన్ని కారణాలు వల్ల సెట్స్ పైకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. ఇక ఒకవేళ యానిమల్ మూవీని తెలుగు హీరోలతో చేయాలంటే.. ‘ఎవరితో చేస్తారు?’ అని ప్రశ్నించగా, సందీప్ వంగా బదులిస్తూ.. “యానిమల్ మూవీని కూడా మహేష్ బాబుతోనే తెరకెక్కించేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ అది నిజం అయ్యి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు. మరి డెవిల్ సినిమా త్వరలో పట్టాలు ఎక్కుతుందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు