Gautam Ghattamaneni : మహేష్ తనయుడి కొత్త షార్ట్ ఫిలిం చూశారా? గౌతమ్ ఎలా నటించాడో చూడండి..
మీరు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసేయండి.. (Gautam Ghattamaneni)
- Saketh U
- Updated on- March 8, 2026 / 06:40 PM IST
Gautam Ghattamaneni
Gautam Ghattamaneni : మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తాడు. అక్కడ యాక్టింగ్ లో ఫ్రెండ్స్ తో కలిసి స్కిట్స్, వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు గౌతమ్.
ఇప్పటికే రెండు మూడు షార్ట్ ఫిలిమ్స్ చేసిన గౌతమ్ తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి14 డేస్ అనే షార్ట్ ఫిలిం చేసాడు. అలెక్సిస్ లక్ష్మి దర్శకత్వంలో గౌతమ్, అనూశే ధనని జంటగా నటించారు. తన గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ అయితే గౌతమ్ ఎలా బాధపడ్డాడు, విలన్ ని పట్టుకోవడం అనే కథతో 3 నిమిషాల 20 సెకండ్స్ షార్ట్ ఫిలిం తీశారు.
Also Read : NTR : 25 ఏళ్ళ తర్వాత సీఎం అంటున్న ఫ్యాన్స్.. ఎన్టీఆర్ మౌనం.. కర్ణాటక మీద ఎన్టీఆర్ ప్రేమ..
అయితే దీంట్లో కథ పూర్తిగా లేదు, సినిమా కూడా పూర్తిగా లేదు అనిపిస్తుంది. దీనికి కంటిన్యూ ఉంటుందా, లేక ఫుల్ షార్ట్ ఫిలిం త్వరలో రిలీజ్ చేస్తారా తెలియాలి. గౌతమ్ అమెరికాలో తన ఫ్రెండ్స్ తో కలిసిచేసిన ఈ షార్ట్ ఫిలింని ఫ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
మీరు కూడా ఈ షార్ట్ ఫిలిం చూసేయండి..
Also Read : Bellamkonda Sai Sreenivas : నిశ్చితార్థం చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఫోటోలు వైరల్..
