Mahesh Babu : ఏజెంట్ టీజర్ పై సూపర్ స్టార్ ప్రశంసలు.. థాంక్యూ బ్రదర్ అంటూ అఖిల్ రిప్లై..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజెంట్ టీజర్ చూసి అఖిల్ ని అభినందించారు. మహేష్ బాబు ఏజెంట్ టీజర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ............
- Saketh U
- Published on- July 17, 2022 / 11:36 AM IST
Agent
Agent : హిట్ కోసం బాగా ట్రై చేస్తున్న అక్కినేని హీరో అఖిల్ ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో హిట్ కొట్టి పర్వాలేదనిపించాడు. ఈ సినిమా హిట్ కొట్టినా అక్కినేని అభిమానులకు మాత్రం ఇంకా ఏదో అసంతృప్తిగా ఉంది. దీంతో ఈ సారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో దిగుతున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా ఛేంజ్ అయ్యారు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొనగా ఇటీవల ఏజెంట్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో హాలీవుడ్ రేంజ్ లో అఖిల్ గన్స్ తో కాలుస్తూ సూపర్ యాక్షన్ మోడ్ లో ఉన్నాడు. దీంతో అఖిల్ ఇంత కొత్తగా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. టీజర్ బాగా వైరల్ అయింది.
Naga Chaitanya : థాంక్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
అఖిల్ ని ఇలా యాక్షన్ మోడ్ లో చూసి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక అఖిల్ కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజెంట్ టీజర్ చూసి అఖిల్ ని అభినందించారు. మహేష్ బాబు ఏజెంట్ టీజర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ”ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగున్నాయి. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. ”థాంక్యూ బ్రదర్, మీ సపోర్ట్, ప్రోత్సాహం చాలా విలువైనది” అని రిప్లై ఇచ్చాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఏజెంట్ సినిమాని ఆగస్టు 12 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
