SSMB 28 : సూపర్‌స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ తో, రాజమౌళితో రెండు సినిమాలు అన్నౌన్స్ చేశాడు కానీ ఆ రెండు సినిమాలు ఇప్పటివరకు మొదలు కాలేదు. అసలు సినిమాల ఊసెత్తకుండా మహేష్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు నెల రోజుల నుంచి. మహేష్ వస్తే కానీ త్రివిక్రమ్ సినిమా మొదలవ్వదు. ఈ లోపు త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ అభిమానులు కూడా మహేష్ బాబు తొందరగా వచ్చి షూట్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
Priya Anand : నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకుంటాను అంటున్న హీరోయిన్
ఎట్టకేలకు ఈ షూట్ మొదలవ్వబోతుంది. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మహేష్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ 28వ సినిమా మొదలవ్వబోతుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సంవత్సరం చివరికి సినిమా షూట్ పూర్తి చేసి 2023 వేసవిలో సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే మరోసారి నటించనుంది. తమన్ సంగీతం ఇవ్వనున్నాడు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! ?
The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨
Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad
— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022