SSMB28 Title : ‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తా అంటున్న మహేష్ బాబు..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న SSMB28 టైటిల్ కోసం ఆడియన్స్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ టైటిల్ ని అనౌన్స్ చేసేశారు.
- gum 95921
- Updated on- June 1, 2023 / 09:51 AM IST
Mahesh Babu Trivikram SSMB28 movie titled as Gunturu Kaaram
SSMB28 : మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా SSMB28. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ లో మహేష్ మాస్ లుక్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీ టైటిల్ ని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా నేడు (మే 31) అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని రీ రిలీజ్ చేయగా.. ఆ మూవీతో పాటు థియేటర్ SSMB28 టైటిల్ గ్లింప్స్ ని ప్రదర్శించారు.
Al Pacino : 83 ఏళ్ల వయసులో ఫాదర్ కాబోతున్న హాలీవుడ్ గాడ్‌ఫాదర్.. అది కూడా 29 ఏళ్ల ప్రేయసితో!
ఇక థియేటర్ లో ఈ గ్లింప్స్ ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో టైటిల్ ని రివీల్ చేసేశారు. మహేష్ మాస్ స్ట్రైక్ ఆడియన్స్ ని బాగా గట్టిగా తగిలింది. ఈ సినిమాకి ముందు నుంచి ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరుకి మొనగాడు’ టైటిల్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో ‘గుంటూరు కారం’ టైటిల్ నే ఖరారు చేశారు. అలాగే గ్లింప్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహేష్ నోటిలో నుంచి బీడీ తీసి కలుస్తుంటే ఊరమాస్ లా ఉంది.
ఈ గ్లింప్స్ ని యూట్యూబ్ లో 6:39 గంటలకు రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 5 నుంచి స్టార్ట్ అవ్వనున్నట్లు, దాదాపు మూడు నెలల పాటు ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది.
