×
Ad

Lokah Chapter 2: లోక సీక్వల్ అనౌన్స్ మెంట్.. హీరోలుగా దుల్కర్, టోవినో.. వీడియో నెక్స్ట్ లెవల్ అసలు

మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న(Lokah Chapter 2) లేటెస్ట్ మూవీ ‘లోక చాప్టర్ 1చంద్ర‌’. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.270 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Makers give Official announcement on Lokah Chapter 2 movie.

Lokah Chapter 2: మలయాళ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న లేటెస్ట్ మూవీ ‘లోక చాప్టర్ 1చంద్ర‌’. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.270 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదే సినిమా తెలుగులో(Lokah Chapter 2) కొత్త లోక పేరుతో విడుదలై ఇక్కడ కూడా సత్తా చాటింది. పెద్ద పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ సాదించింది ఈ మూవీ.
Nani-Sujeeth: నాని సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుజీత్.. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్

కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో నెస్లన్, చందు, సాయికుమార్ కీ రోల్స్ ప్లే చేశారు. మలయాళ స్టార్స్ దుల్కర్ సల్మాన్, టొవినో థామస్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు. డొమెనిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ సినిమాను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో సీక్వెల్ గా ప్రకటించారు మేకర్స్. తాజాగా, లోక చాప్టర్ 2ని అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. మొదటి పార్ట్ లో గెస్ట్ రోల్స్ చేసిన దుల్క‌ర్‌ సల్మాన్, టొవినో థామస్ ఈ సీక్వెల్ లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు.

దీనికి సంబదించిన వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీక్వల్ పై అంచనాలను పెంచేసింది. మొదటి పార్ట్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ కోసం భారీగానే ఖర్చు చేయనున్నారు మేకర్స్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కాబట్టి, హాలీవుడ్ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారని సమాచారం. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సీక్వల్ ఎంతటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.