Kanguva : ‘అతడి చూపులు కత్తి కన్నా పదును.. రాజు వచ్చేస్తున్నాడు..’ అర్థరాత్రి సూర్య ఫ్యాన్స్‌కు పని పడింది
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న సినిమా కంగువ(Kanguva). తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : July 22, 2023 / 05:17 PM IST
Kanguva
GlimpseOfKanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న సినిమా కంగువ(Kanguva). తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని (Disha Patani) నటిస్తోంది. మూవీని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన మోషన్ పోస్టర్, టైటిల్‌ను ప్రకటిస్తూ వచ్చిన గ్లింప్స్ మూవీపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక జూలై 23న హీరో సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని కంగువ గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఒక్కొ పోస్టర్‌ను విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. యుద్దవీరుడిలా ఖడ్డం చేతబట్టి కదనరంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఉన్న హాఫ్ లుక్, గుర్రం పై వస్తున్న బ్యాక్ లుక్ ఇప్పటికే విడుదల కాగా మంచి స్పందన వచ్చింది.
Devara : దేవరకు తలనొప్పిగా మారిన ఫ్యాన్స్.. చిత్ర బృందం కీలక నిర్ణయం..!
ఇక తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కంటికి దగ్గరగా కత్తిని పట్టుకుని శత్రువు వైపు కోపంగా చూస్తుంటాడు సూర్య. అతడి చూపులు కత్తి కన్నా పదును.. రాజు వచ్చేస్తున్నాడు.. అనే క్యాప్షన్ ఇచ్చింది. సూర్య పట్టుకున్న కత్తి పై 23 జూలై 2023, 12.01 AM అని రాసి ఉంది. అంటే.. కంగువ గ్లింప్స్‌ను ఈ రోజు అర్ధరాత్రి అంటే 23న తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషానికి విడుదల చేయనున్నట్లు తెలిపింది.
His eyes sharper than the sword! ?️
The King arrives ?#GlimpseOfKanguva from 23rd July, 12:01 AM @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth @KanguvaTheMovie#Kanguva ? pic.twitter.com/vLNXy4OxQ3
— UV Creations (@UV_Creations) July 22, 2023
సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం పూర్తి అయ్యింది. ఈ ఏడాది చివరి లోపు చిత్రీకరణ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో 10 భాషల్లో విడుదల చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.
Nithiin 32 : నితిన్-వక్కంతం వంశీ సినిమా క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ లుక్‌కు టైమ్ ఫిక్స్
