Malaika Arora : రోడ్ యాక్సిడెంట్.. హాస్పిటల్లో బాలీవుడ్ హీరోయిన్
తాజాగా మలైకా యాక్సిడెంట్ కి గురయింది. బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా నిన్న శనివారం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద యాక్సిడెంట్........
- Saketh U
- Updated on- April 3, 2022 / 11:08 AM IST
Malaika
Malaika Arora : బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ తో ఐటెం భామగా ప్రేక్షకులకి దగ్గరైంది మలైకా అరోరా. తాజాగా మలైకా యాక్సిడెంట్ కి గురయింది. బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా నిన్న శనివారం ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆమెతో పాటు డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉన్నారు. ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకుంటూ వచ్చి మలైకా ప్రయాణిస్తున్న కారుని ఢీ కొట్టాయి.
Allu Arjun : వైజాగ్‌లో అల్లుఅర్జున్‌కి ఘన స్వాగతం
ఈ ప్రమాదంలో మలైకా కారు డ్యామేజ్ అయింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ మలైకాను వెంటనే నేవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెని చెక్ చేసి చికిత్స అందించి ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆమెను రాత్రి అంతా అబ్జర్వేషన్లో ఉంచామని, ఇవాళ మరోసారి ఆమెని చెకప్ చేసి, కొన్ని పరీక్షలు నిర్వహించి, అన్ని బాగానే ఉంటే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక మలైకా సోదరి, నటి అమృతా అరోరా తన సోదరి గురించి మీడియాతో మాట్లాడుతూ మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
