Chiranjeevi : చిరంజీవి పిలిచి డైరెక్షన్, యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..!

చిరంజీవితో సినిమా చేసేందుకు ప్రతిఒక్కరు ఎదురు చూస్తుంటారు. అయితే చిరంజీవే పిలిచి డైరెక్షన్, యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే ఒక స్టార్ హీరో నో చెప్పాడట.

  • Published On : March 22, 2024 / 05:21 PM IST

Malayala Star Hero ignores Chiranjeevi offer

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు, నటీనటులు ఎదురు చూస్తుంటారు. ఒక్క చిన్న అవకాశమైనా వస్తే చాలు అని ఆశపడుతుంటారు. కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే కలుగుతుంది. అలాంటి అవకాశం ఓ నటుడికి ఒకసారి కాదు రెండుసార్లు వచ్చినా నో చెప్పాడట. ఇంతకీ ఎవరు ఆ నటుడు..? చిరంజీవికి నో చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది..?

ఆ నటుడు మరెవరో కాదు, మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ‘పృథ్వీరాజ్ సుకుమారన్’. చిరంజీవి ఈ నటుడికి మొదటిసారి ‘సైరా’ సినిమాలో అవకాశం ఇచ్చారట. సైరా సినిమాలో నటించాలని పృథ్వీరాజ్ కి ఫోన్ చేసి మరి చిరంజీవి అడిగారట. కానీ, ఆయన ‘ఆడుజీవితం’ సినిమాకి ఫుల్ డేట్స్ ఇచ్చేయడంతో సైరాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట. అదే విషయాన్ని చిరంజీవికి చెబితే ఆయన అర్థంచేసుకొని ఓకే అన్నారట.

Also read : Janhvi Kapoor : తిరుపతి కొండపై ప్రియుడితో.. మావిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ..

మళ్ళీ ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించే అవకాశంతో పాటు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. గాడ్ ఫాదర్ మూవీ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ అని అందరికి తెలిసిందే. ఆ చిత్రాన్ని మలయాళంలో డైరెక్ట్ చేసింది పృథ్వీరాజే. గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ పోషించిన పాత్రని మలయాళంలో పృథ్వీరాజ్ పోషించారు. ఆ పాత్రని, సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాన్ని చిరంజీవి, పృథ్వీరాజ్ కి ఇచ్చారు.

కానీ అప్పుడు కూడా ‘ఆడుజీవితం’ సినిమానే అడ్డు వచ్చింది. దాదాపు ఆరేళ్ళ నుంచి ఈ సినిమాని పృథ్వీరాజ్ చేస్తూనే వచ్చారు. ప్రభాస్ ‘సలార్’ సినిమా కూడా ఈ మూవీ వల్లే లేట్ అయ్యింది. పృథ్వీరాజ్ ఆడుజీవితం పూర్తి చేసుకొని వచ్చేవరకు సలార్ టీం వెయిట్ చేసింది. ఇలా ఈ ఒక్క సినిమా వల్ల తాను రెండుసార్లు చిరంజీవికి నో చెప్పాల్సి వచ్చిందని, అయితే తన పరిస్థితి చిరంజీవి అర్థంచేసుకున్నారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.