Malayalam actor Soubin Shahir
Coolie actor Soubin Shahir: మలయాళం నటుడు సౌబిన్ షాహిర్ 2024లో “సర్వైవల్ థ్రిల్లర్” మంజుమ్మెల్ బాయ్స్ లో నటించాడు. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తన ఫేమ్‌ను మరింత పెంచుకున్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా “కూలీ“లో కీలక ప్రతినాయక పాత్రలో నటించాడు.
ఈ సినిమా 2025 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల అయింది. కూలీలోని ఐటం సాంగ్ “మోనికా”లో షాహిర్ వేసి స్టెప్పులను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఆ సాంగ్‌లో పూజా హెగ్డేను మించి షాహిర్ మెరిశాడని ప్రేక్షకులు అంటున్నారు. షూటింగ్ సెట్లో సౌబిన్ ప్రదర్శన చూసిన రజనీకాంత్ కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.
Also Read: వినాయకుడి 32 రూపాలు.. వాటికి అర్థాలు ఇవే.. విఘ్నహర శరణం..
ఓటీటీల్లో మలయాళ డబ్బింగ్ మూవీలు చూసే వారికి సౌబిన్ గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఈ మధ్య సౌబిన్ (Coolie actor Soubin Shahir) బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ కారుని కొన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ కారు విలువ రూ.3.30 కోట్లు. తన కుటుంబంతో కలిసి అతడు ఈ కారుతో ఫొటోలు తీసుకున్నాడు.