Lena : గగన్‌యాన్ వ్యోమగామిని వివాహం చేసుకున్నాను.. మలయాళ నటి లీనా..
గగన్‌యాన్ వ్యోమగామిని వివాహం చేసుకున్నాను అంటూ రహస్యాన్ని బయట పెట్టిన మలయాళ నటి లీనా.
- gum 95921
- Published On : February 28, 2024 / 11:16 AM IST
Malayalam Actress Lena Reveals She Is Married Gaganyaan Astronaut Prasanth Balakrishnan Nair
Lena : మలయాళ నటి లీనా.. తాను గగన్‌యాన్ వ్యోమగామిని వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు. జనవరిలోనే పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. ఈ విషయాన్ని ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. గగన్‌యాన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల బృందాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నలుగురు వ్యోమగాముల్లో మొదటి పేరు ‘ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్’.
నరేంద్ర మోదీ ప్రశాంత్ బాలకృష్ణన్ పేరుని అనౌన్స్ చేసిన కొన్ని గంటలకు లీనా.. తమ పెళ్లి విషయాన్ని బయట పెట్టారు. “ఇండియన్ మొదటి వ్యోమగామిగా ప్రశాంత్ బాలకృష్ణన్ పేరుని మోదీజీ ప్రకటించారు. ఇది మన దేశానికీ, కేరళ రాష్ట్రానికి ఒక హిస్టారిక్ మూమెంట్. ముఖ్యంగా నాకు ఇది ఎంతో సంతోషకరమైన సందర్భం. ఎందుకంటే ఈ సందర్భంలో ఒక రహస్యం తెలియజేయడం కోసం నేను ఎంతగానో ఎదురు చూసాను. జనవరి 17, 2024న నేను ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ వివాహం చేసుకున్నాము. అది ఇప్పుడు అధికారికంగా మీకు తెలియజేస్తున్నాము” అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
Also read : Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో.. హరిహర వీరమల్లు దర్శకుడు కూడా..
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. కాగా లీనాకి ఇది రెండో వివాహం. అభిలాష్ కుమార్ అనే వ్యక్తిని 2004లో వివాహం చేసుకున్న లీనా.. 2013లో విడాకులు తీసుకోని విడిపోయారు. లీనా తన 25 ఏళ్ళ సినిమా కెరీర్‌లో.. సౌత్ లోని పలు భాషల్లో 175కి పైగా సినిమాల్లో నటించారు. నటిగానే కాకుండా రచయితగా కూడా తన టాలెంట్ ని ఆడియన్స్ కి చూపించారు.
