Mamitha Baiju: నాకు మా తమ్ముడు చెప్పాడు.. నేను అసలు నమ్మలేదు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన మమిత

Mamitha Baiju Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్ అవడం అనేది మా దురదృష్టం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన మమిత బైజు(Mamitha Baiju).

Mamitha Baiju emotional comments on Jana Nayagan movie leak

  • జన నాయగన్ లీక్ పై మమిత ఎమోషనల్ కామెంట్స్
  • తమ కష్టం వృధా అయ్యింది అంటూ కామెంట్స్
  • అంతా మా దురదృష్టం అంటూ ఆవేదన

Mamitha Baiju: మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజు ప్రధాన పాత్రలో నటించిన ‘జన నాయగన్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ అనుమతులు లభించకపోవడంతో వాయిదా పడింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమా లీక్ కావడం, కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చిత్ర యూనిట్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రాజెక్ట్ ఇలా లీక్ అవ్వడంపై మమిత బైజు (Mamitha Baiju)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

*అవన్నీ ఫేక్.. నేను హైదరాబాద్ వస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్

ఈ వార్త తన తమ్ముడు చెప్పినప్పుడు మొదట నమ్మలేదని, కానీ అది నిజమని తెలిశాక సినిమా కోసం తాము పడ్డ కష్టం వృథా అయిందని భావించి చాలా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే మమిత బైజు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఆమె అభిమానులను కలచివేసింది. ఈ దురదృష్టకర సంఘటనపై ఆమె ఎమోషనల్ అవుతూ, ఒక సినిమాను రూపొందించడంలో ఉన్న కష్టాన్ని ఈ లీకులు ఏ విధంగా దెబ్బతీస్తాయో వివరిస్తూ కుమిలిపోయారు. దీంతో మమిత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం కోలీవుడ్‌లో చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. సూర్య సరసన ‘విశ్వనాథం & సన్స్’ చిత్రంలో నటిస్తుండటంతో పాటు, ధనుష్‌తో కలిసి ‘కారా’ అనే సినిమాలో కూడా నటించింది. ఇటీవల విడుదలైన ‘కారా’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడంతో ఆమె నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. మలయాళంలో కూడా మూడు చిత్రాల్లో నటిస్తూ మమిత తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ త్వరలోనే విడుదల కానుండటంతో ఆమె పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.