Manchu Lakshmi : మీ మగాళ్లు ఏమైనా చేయొచ్చు.. అలాంటి ఆడవాళ్లు డేంజర్.. అందుకే హాలీవుడ్ వెళ్లిపోయా..
ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మగాళ్ళ గురించి, టాలీవుడ్ గురించి, తన హాలీవుడ్ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. (Manchu Lakshmi)
- Saketh U
- Published on- April 28, 2026 / 02:01 PM IST
Manchu Lakshmi
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మి అడపాదడపా సినిమాలతో పలకరిస్తుంది. ఓ పక్క బిజినెస్ లు, తన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఛాన్సుల కోసం ట్రై చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మగాళ్ళ గురించి, టాలీవుడ్ గురించి, తన హాలీవుడ్ కష్టాల గురించి చెప్పుకొచ్చింది.
Also Read : Balakrishna : బాలయ్య ఆ మాట చెప్పగానే ఏడ్చేసాను.. అవన్నీ బయటకు రావు.. మంచు లక్ష్మి కామెంట్స్..
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. మీ మగాళ్లు ఏమైనా చేయొచ్చు. మాకు ఆడవాళ్లకు మాత్రం అడ్డు గీతలు ఉంటాయి. ఇండస్ట్రీలో మోహన్ బాబు కూతురు నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి అని ఉంది. తెలుగు సినిమా కంటే హాలీవుడ్ సినిమా ఈజీ చేయడం. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మంజుల, అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ వచ్చారు. ఏమైంది. వాళ్ళకే కష్టాలు తప్పలేదు. వాళ్ళని హీరోయిన్ అవ్వనివ్వలేదు. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీలు అక్కడే ఆగిపోయారు. తెలుగు మగాళ్లలో ఆడది అణిగిమణిగి ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండాలి అనే భావం ఎక్కువ. చాలా మంది ఇంకా అలాగే బతుకుతున్నారు.
అందుకే హాలీవుడ్ కి వెళ్ళాను. అక్కడ నా ఛాయస్ ఉంది అని. ఇక్కడ నేను కాలేజీకి వెళ్లకపోయినా ఇంటికి ఫోన్ చేసే వాళ్ళు. అమెరికాలో అలా కాదు. మన ఇష్టం. నేను మగాళ్లు నచ్చే అమ్మాయిలా ఉండను కాబట్టి నన్ను తిడతారు. ఆడవాళ్లు కూడా తిడతారు. ఆడవాళ్ళూ ఇలాగే ఉండాలి అని మాట్లాడే ఆడవాళ్లే ఇంకా డేంజరస్. మగవాళ్ళ వల్ల ట్రైన్ అయ్యారు అలాంటి ఆడవాళ్లు. అలాంటి మహిళలు వాళ్ళ మైండ్ తో మాట్లాడలేరు. వాళ్లకు తెలీదు ఫ్రీడమ్ గురించి. నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోను. ఇండియాలోనే హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి అంటారు. అమెరికాలో మాత్రం ట్యాలెంట్ చూస్తారు అందం, షేప్ కాదు అని తెలిపింది.
అలాగే తన హాలీవుడ్ కష్టాల గురించి మాట్లాడుతూ.. ఇక్కడ నేను ఒక రాణిలా బతికాను. కానీ హాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను. అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లకు నెంబర్స్ ఇస్తారు. పేర్లు పెట్టి పిలవరు. ఆ నెంబర్లతోనే పిలిచి ఏం చేయాలో చెప్తారు. నేను అలా చేశాను. హాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి SAG మెంబర్షిప్ తీసుకొని యాక్టర్ అయ్యాను. ఇండియన్, తెలుగు కావడంతో లాంగ్వేజ్ కి చాలా కష్టపడ్డాను. చాలా విమర్శలు చూశాను హాలీవుడ్ లో కూడా అని చెప్పుకొచ్చింది.
