David Reddy Teaser: గాంధీకి వ్యతిరేకంగా ‘డేవిడ్ రెడ్డి’ పోరాటం.. అంచనాలు పెంచుతున్న టీజర్
మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా 'డేవిడ్ రెడ్డి(David Reddy Teaser)' చేసిన పోరాటం.
- V Santhosh Kumar
- Published on- May 20, 2026 / 07:29 PM IST
manchu manoj David reddy teaser released
- మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ టీజర్
- ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ యాక్షన్ కథ
- గాంధీకి వ్యతిరేకంగా పవర్‌ఫుల్ పోరాటం
David Reddy Teaser: వైవిధ్యభరితమైన పాత్రలతో మెప్పించే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చాడు. మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా భారీ పాన్-ఇండియా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). ప్రీ-ఇండిపెండెన్స్ (స్వాతంత్ర్యానికి పూర్వం) నాటి పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
మనోజ్ బర్త్‌డే స్పెషల్‌గా చిత్ర బృందం ‘వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి’ పేరుతో ఈ సినిమా పవర్‌ఫుల్ టీజర్(David Reddy Teaser)ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటూ ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, డేవిడ్ రెడ్డి అనే పాత్ర చేసే సాయుధ పోరాటం చుట్టూ ఈ కథ తిరగబోతున్నట్లు టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు.
“గాంధీకి వ్యతిరేకంగా డేవిడ్ రెడ్డి పోరాటం” అంటూ టీజర్‌లో వచ్చిన పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చాయి. మంచు మనోజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
