Manchu Manoj : తన సినిమాలు, సేవా సంస్థ గురించి మాట్లాడిన మంచు మనోజ్..

నేడు మే 20 మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Manchu Manoj)

  • Published on- May 20, 2026 / 09:39 AM IST

Manchu Manoj

Manchu Manoj : రా కింగ్ స్టార్ మనోజ్ మంచు ప్రయోగాత్మక సినిమాలతో, డిఫరెంట్ కంటెంట్‌తో ఉన్న సినిమాల్ని చేస్తూ ప్రెకషకులని మెప్పించాడు. మధ్యలో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్నా ఇటీవల భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మిరాయి తో హిట్ కొట్టి వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. నేడు మే 20 మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇటీవలే తన భార్య మౌనికతో కలిసి ఓ సామాజిక సేవా సంస్థని స్థాపించాడు.

తన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ సంస్థ గురించి చెప్తూ.. నేను అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాను. అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని, నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఈ సంస్థ విధి విధానాలు తయారుచేసే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం ఆ రోజు ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను అని తెలిపారు.

Also Read : Manchu Manoj Birthday : మంచు మనోజ్ బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?

తన సినిమాల గురించి మాట్లాడుతూ.. నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మ ఇచ్చిన విజయ్ కనకమేడల, కార్తిక్ ఘట్టమనేనిలకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు నచ్చిన కథల్నే చేస్తాను. డేవిడ్ రెడ్డి అనే సినిమా చేస్తున్నాను. 40 శాతం పూర్తయింది షూటింగ్. మధ్య ప్రదేశ్‌లో షూటింగ్ చేసాము. వాట్ ది ఫిష్ సినిమా ప్రస్తుతానికి ఆగింది. ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేను. జూన్ లో రక్షక్ అనే సినిమా మొదలవుతుంది. అందులో పోలీసాఫీసర్ గా కనిపిస్తాను. చేతిలో ప్రస్తుతం అయిదారు సినిమాలు ఉన్నాయి అని తెలిపారు.

రాజకీయాల గురించి మాట్లాడుతూ.. మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావాల్సింది ఏం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు అని తెలిపారు.