×
Ad

Manirathnam : పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యకు బదులు ఆమెను తీసుకోవాలనుకున్నా.. ఐశ్వర్య డ్యూయల్ రోల్..

ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు మణిరత్నం ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం ఆమె కాకుండా ఇంకా ఎవరినైనా తీసుకోవాలనుకున్నారా అని ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి మణిరత్నం సమాధానమిస్తూ...............

  • Published On : September 20, 2022 / 07:26 AM IST

Manirathnam first wants rekha in aishwarya role for ponniyin selvan

Manirathnam :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య రాయ్‌, త్రిష, జయరామ్.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు మణిరత్నం ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం ఆమె కాకుండా ఇంకా ఎవరినైనా తీసుకోవాలనుకున్నారా అని ఇంటర్వ్యూలో అడిగారు. దీనికి మణిరత్నం సమాధానమిస్తూ.. ”1994, 2011లోనే ఈ సినిమాని చేయడానికి ట్రై చేశాను. అప్పుడు కమల్ హాసన్ తో ఈ సినిమా చేద్దామనుకున్నాను. కానీ కుదరలేదు. ఆ పాత్రకు అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖను అనుకున్నాను. కానీ సినిమా సెట్ అవ్వకపోవడంతో రేఖని తీసుకోలేకపోయాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఐశ్వర్యని తీసుకున్నాను” అని తెలిపారు.

BiggBoss 6 Day 15 : మూడో వారం నామినేషన్స్.. అరుపులు, గొడవలు.. కొట్టుకోవడానికి కూడా రెడీ అనేలా ఉన్నారుగా..

అలాగే పొన్నియిన్ సెల్వన్ -1లో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేస్తోందని, నందిని దేవి, ఆమెకు మూగ తల్లిగా మందాకిని దేవి అనే రెండు పాత్రల్లో ఐశ్వర్య కనిపించనుందని తెలిపారు మణిరత్నం.