Chiranjeevi : చిరంజీవి పై మన్సూర్ అలీఖాన్ కేసు పెట్టబోతున్నారా..?

మన్సూర్ అలీఖాన్ చిరంజీవి పై కేసు నమోదు చేయబోతున్నాడంటూ తమిళనాట వార్తలు.

Chiranjeevi : చిరంజీవి పై మన్సూర్ అలీఖాన్ కేసు పెట్టబోతున్నారా..?

Mansoor Ali Khan is go to file a case on Chiranjeevi Trisha Kushboo

Chiranjeevi : చిరంజీవి పై కేసు నమోదు చేస్తానంటూ మన్సూర్ అలీఖాన్ ప్రకటించినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిష పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ ని త్రిషతో పాటు చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, కుష్బూ, డైరెక్టర్ కార్టీక్ సుబ్బరాజు, చిన్మయి, నితిన్ వంటివారు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై స్పందిస్తూ దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ కి నోటీసులు పంపింది. అలాగే జాతీయ మహిళా కమిషన్ మన్సూర్ పై కేసు కూడా నమోదు చేసింది.

త్రిషకు సారీ చెప్పేది లేదంటూ వచ్చిన మన్సూర్.. ఈ విషయం పెద్దది అవుతుండడంతో ఇటీవల త్రిషకు సారీ చెబుతూ ఒక బహిరంగా లేక రిలీజ్ చేశారు. ఇక్కడితో ఈ వివాదం ముగిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ వివాదాన్ని తెరపైకి తీసుకు వస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏంటనేది తెలుసుకోకుండా తనపై కామెంట్స్ చేసిన త్రిష, కుష్బూ, చిరంజీవి పై కేసు నమోదు చేయడానికి మన్సూర్ సిద్దమయ్యారట. క్రిమినల్, ప్రజా శాంతికి భంగం కలిగించిన చట్టాలు కింద రేపు కోర్టులో మన్సూర్ కేసు నమోదు చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read : Allu Arjun : అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి.. ఇప్పుడేం చేస్తోందంటే?

అసలు ఏం జరిగిందంటే.. విలన్ రోల్స్ చేసే మన్సూర్ తన కెరీర్ లో హీరోయిన్స్ చాలా రేప్ సీన్స్ చేశారు. ఇక ఇటీవల ఈయన త్రిష హీరోయిన్ గా నటించిన ‘లియో’ సినిమాలో కూడా ఒక పాత్ర చేశారు. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డాను అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే వివాదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలకు ఆయన వివరణ కూడా ఇచ్చారు.

మన్సూర్ కి చాలావరకు రేప్ సన్నివేశాలు కలిగి ఉండే పాత్రలే ఎక్కువ వస్తుండడంతో.. ఇందులో కూడా అలాంటి రోల్ ఇస్తారనుకున్నట్లు, కానీ అసలు త్రిషతో సన్నివేశమే లేని పాత్ర ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. దీన్ని కొంతమంది నెగిటివ్ గా ప్రమోట్ చేసి ఇంత పెద్ద వివాదం సృష్టించారని అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు.