Allu Arjun : అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి.. ఇప్పుడేం చేస్తోందంటే?

20 సంవత్సరాల క్రితం సినిమా తెరపై మెరిసిన ఆ నటి.. తర్వాత సీరియల్స్‌లో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల మీడియాకు కనిపించిన ఆమె ఎవరంటే?

Allu Arjun : అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న నటి.. ఇప్పుడేం చేస్తోందంటే?

Allu Arjun

Santhoshi : 2004 లో వచ్చిన ‘జై’ సినిమా చూసిన వాళ్లకి నటి సంతోషి గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో కనిపించిన సంతోషి తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Allu Arjun

Allu Arjun

 

2004 లో తేజ డైరెక్షన్‌లో ‘జై’ సినిమా వచ్చింది. నవదీప్‌కి జోడీగా నటించిన సంతోషి ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయిన సంతోషి తమిళ సీరియల్స్‌లో బిజీ అయ్యారు. నటి రాధిక సంస్థ రాడాన్‌లో 10 ఏళ్లపాటు నాన్ స్టాప్ సీరియల్స్ చేసారు. తెలుగులో కూడా ‘లక్ష్మీ నివాసం’ సీరియల్‌లో కనిపించారు సంతోషి. ఆ సమయంలోనే నటుడు ప్రసాద్ బాబు కొడుకు సీరియల్ నటుడు శ్రీకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంతోషి. ఆ తర్వాత సీరియల్స్‌కి కూడా దూరమైన సంతోషి బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్లష్ (PLUSH) అనే పేరుతో మూడు బ్రాంచ్‌లను ప్రారంభించిన సంతోషి సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సంతోషి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.

Sudigali Sudheer : మళ్ళీ బుల్లితెరకు సుడిగాలి సుధీర్.. అలాగే ఓటీటీలో వెబ్ సిరీస్..

Allu Arjun 2

Allu Arjun 2

‘జై’ సినిమా కన్నా ముందు ‘ఆర్య’ సినిమా ఛాన్స్ వచ్చిందట సంతోషికి. అయితే అదే సమయంలో  ‘జై’ కి చేయాల్సి వచ్చిందట. ఆ తర్వాత పూరీ సినిమాలో కూడా అవకాశం వచ్చినట్లే వచ్చి తప్పిపోయిందట. కొన్ని సినిమాల్లో లిప్ లాక్, క్లీవేజ్ సీన్లు చేయమనడంతో వదులుకున్నట్లు సంతోషి చెప్పారు. జై సినిమా తర్వాత సరైన గైడెన్స్ లేక కూడా సీరియల్స్ వైపు వెళ్లిపోయినట్లు చెప్పారు. అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని.. ఆర్య సినిమాలో తన పక్కన నటించే ఛాన్స్ మిస్ అయినందుకు ఇప్పటికీ ఫీలవతాను అన్నారామె. ఇప్పటికైనా బన్నీ పక్కన ఛాన్స్ వస్తే చేస్తాను అని చెప్పారు. సినిమా, సీరియల్స్ పర్మనెంట్ కాదనే బ్యూటీ రంగంలోకి వచ్చినట్లు చెప్పారు సంతోషి. ఇప్పటికీ అవకాశాలు వస్తే అదీ తనకు తగ్గ పాత్ర వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు సంతోషి.