Mary kom : బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టిన బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్.. తొలి రోజే గొడవ.. ప్రియాంక చోప్రా వీడియో సందేశం..
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ (Mary kom) బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు.
Mary kom enters bigg boss 20 house priyanka chopra sends special message
Mary kom : బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 20లో కంటెస్టెంట్‌గా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ వచ్చారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రత్యేకంగా వీడియో సందేశం పంపింది. అలాగే ఇతర కంటెస్టెంట్లకు సరదాగా ఒక హెచ్చరిక కూడా చేసింది.
2014లో వచ్చిన ‘మేరీ కోమ్’ బయోపిక్‌లో మేరీ పాత్రను పోషించిన ప్రియాంక.. ఆమె ధైర్యం, పట్టుదల గురించి గుర్తుచేసుకుంటూ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది. ‘నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నావు. నువ్వు ఎంత బలమైన, ధైర్యవంతమైన, పట్టుదల కలిగిన వ్యక్తివో నాకు ప్రత్యక్షంగా తెలుసు. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండాలి. మనసు విప్పి ఆడాలి. నీ ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని ప్రియాంక చెప్పింది.
Minakshi Goswami : మహేంద్రగిరి వారాహి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీనాక్షి గోస్వామి.. ఫోటోలు వైరల్..
View this post on Instagram
ఇక మిగతా కంటెస్టెంట్లకు సరదా హెచ్చరికలు జారీ చేసింది. మేరీకి ఎదురుగా నిలబడాలని అనుకుంటే, సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఆమె నాకౌట్ చాలా బలంగా ఉంటుంది అంటూ ప్రియాంక తెలిపింది.
సెప్టెంబర్ 6న జరిగిన గ్రాండ్ ప్రీమియర్‌లో మేరీ కోమ్ తన పిల్లలతో కలిసి ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. వేదికపై సల్మాన్ ఖాన్‌ను కలిసింది. వేదికపై ఆమె మాట్లాడుతూ.. క్రీడా ప్రపంచానికి బయట తన వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను ప్రేక్షకులకు చూపించే అవకాశం ఈ షో ద్వారా దొరుకుతుందని ఆమె తెలిపింది. ఒక తల్లిగా, ఒక అథ్లెట్‌గా తనను తీర్చిదిద్దిన జీవితంలోని అనేక అంశాలను ప్రేక్షకులు చూస్తారని చెప్పింది.
ఇక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆమె హౌస్ డైనమిక్స్‌లో భాగమైపోయింది. మొదటి రోజే బెడ్ విషయంలో గాయకుడు ఖాజీ తౌకీర్‌తో ఆమెకు గొడవ జరిగింది.ఆసిఫ్ ఖాన్, కనికా మన్, స్కౌటాప్ అకా తన్మయ్ సింగ్, ఆమ్రపాలి దూబే, మహి విజ్, యుంగ్ DSA, ఖాజీ టౌకీర్, అరిష్ఫా ఖాన్, రోహెద్ ఖాన్, ఇషా రిఖి, గుల్లు అకా కుశాల్ తన్వర్ తదితరులు ఈ సీజన్లో ఉన్నారు.
View this post on Instagram
