Epic Pre release event : మొన్న వదిన, రేపు అన్న.. ఆనంద్ దేవరకొండ స్కెచ్ మామూలుగా లేదుగా.. ఎపిక్ ప్రీ రిలీజ్ ఎప్పుడంటే?
ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Epic Pre release event) మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది.
Anand Deverakonda Epic Pre release event tomorrow in Hyderabad
Epic Pre release event : ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూవీ ఎపిక్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైష్ణవి చైతన్య కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 8) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని దసుపల్లా హోటల్ ఇందుకు వేదిక కానుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆనంద్ దేవరకొండ అన్న హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Gayathri Simhadri : గుంటూరు మిర్చిలా కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రి ఫోటోలు వైరల్..

సెప్టెంబర్ 4న నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు స్టార్ హీరోయిన్, విజయ్ దేవరకొండ భార్య రష్మిక మంధాన ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. బేబీ మూవీ తరువాత ఆనంద్, వైష్ణవి జంట నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
