Vasudheva Sutham : ‘వసుదేవసుతం’ నుంచి ‘ఆనందాల వేళ’ సాంగ్ రిలీజ్.. హీరో ఆది చేతుల మీదుగా..
మీరు కూడా ఈ పాటను వినేయండి.. (Vasudheva Sutham)
- Saketh U
- Published on- July 6, 2026 / 09:43 AM IST
Vasudheva Sutham
Vasudheva Sutham : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వసుదేవసుతం సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను విడుదల చేసారు.
మీరు కూడా ఈ పాటను వినేయండి..
‘ఆనందాల వేళ..’ అంటూ సాగే ఈ పాటను లవ్లీ హీరో ఆది రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లిరికల్ వీడియోని చూసి మూవీ యూనిట్ ని ఆది అభినందించారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల పాడారు. హోలీ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ, లవ్ సాంగ్ లా ఉంది ఈ పాట.
